కావా‌ల్సిన ప‌దార్థాలు:
గోధుమ పిండి- ఒక‌‌ కప్పు
నెయ్యి- అర‌ కప్పు
పంచదార- ఒక‌ కప్పు
పంచదార కారామిల్ కోసం- నాలుగుటేబుల్ స్పూన్లు


 
జీడిపప్పు- ప‌ది
బాదం ప‌ప్పు- ప‌ది
కిస్‌మిస్‌- రెండు టీ స్పూన్లు
యాలికుల పొడి- అర టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా ఒకబౌల్‌లో గోధుమ పిండి వేసి, నీరు పోసి క‌లుపుకోవాలి. మెత్తటి చపాతీ ముద్దలా అయ్యాక దాన్ని గిన్నెలోనే ఉంచి దానిపై నీరు పొయ్యాలి. ముద్ద మొత్తం నీటిలో మునగాలి. ఇలా రెండు మూడు గంటలు ఉంచాలి. ఆ తర్వాత గోధుమ ముద్దను బాగా పిసికితే అందులో మెత్తటి పదార్థం నీటిలోకి వచ్చేస్తుంది. ఆ తెల్లటి పాలలాంటి నీటిని ఓ గిన్నెలోకి వడగట్టుకుని గంట తర్వాత చూస్తే నీరు పైకి తేలి పిండి పదార్థం కిందకు చేరుతుంది. 

 

ఇప్పుడు ఆ నీటిని తీసేయాలి. ఆ త‌ర్వాత‌ స్టవ్‌పై పాన్ పెట్టి అందులో పంచదార వేసి, అరగ్లాస్ వాటర్ పోసి పంచదార కరిగే వరకూ తిప్పుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్‌పై పాన్‌ పెట్టి అందులో కారామిల్ కోసం ఉంచిన చక్కెర, కొద్దిగా నీరు వేసి కలుపుతూ ఉండాలి. గోధుమ రంగు వచ్చే వరకూ కలపాలి.  ఆ త‌ర్వాత కారామిల్‌ను మొదటి పాన్‌లోని పంచదార పాకంలో వెయ్యాలి. 

 

ఇప్పుడు పంచదార పాకంలో గోధుమ పిండి పాలను కొద్దికొద్దిగా పోస్తూ కలుపుతూ ఉండాలి. కొద్ది నిమిషాలు ఆగితే అది చిక్కబడుతుంది. అప్పుడు మళ్లీ కాస్త నెయ్యి వేసి కలపాలి. అలా నెయ్యి వేస్తూ కలుపుతూ చివర్లో బాగా గట్టిపడి ముద్దలా అయినప్పుడు యాల‌కుడి పొడి, జీడిపప్పు, బాదం ప‌ప్పు, కిస్‌మిస్‌ వేసి కలపాలి.  అంతే ఎంతో రుచిక‌ర‌మైన య‌మ్మీ య‌మ్మీ గోధుమ పిండి హల్వా రెడీ. దీన్ని పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబ‌ట్టీ ఈ లాక్‌డౌన్ టైమ్‌లో మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: