కావాల్సిన ప‌దార్థాలు:
జీడిపప్పు- ఒక కప్పు
టమోటాలు- రెండు 
కారం- ఒక‌ టీ స్పూను
పచ్చిమిర్చి- నాలుగు

 

అల్లం, వెల్లుల్లి పేస్టు- ఒక‌ టీ స్పూను
పసుపు- అర‌ టీ స్పూను
గరం మసాల- అర‌ టీ స్పూను
ఉప్పు- రుచికి తగినంత
జీలకర్ర- ఒక‌ టేబుల్ స్పూన్

 

కొత్తిమీర- ఒక క‌ట్ట‌
నూనె- మూడుటేబుల్‌ స్పూన్లు
ల‌వంగాలు- రెండు
దాల్చిన చెక్క‌- చిన్న ముక్క‌
యాలికులు- రెండు

 

త‌యారీ విధానం: ముందుగా పచ్చిమిర్చి,  టమోటోలు, అల్లం వెల్లుల్లి, కొద్దిగా జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక మిగిలిన జీడిపప్పులు వేసి లైట్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అదే పాన్ లో జీలకర్ర వేసి వేగాక ల‌వంగాలు, దాల్చిన చెక్క యాలికులు కూడా వేయాలి. అవి కూడా వేగిన తర్వాత పసుపు, గరం మసాలా, కారం వేసి వేగించాలి.

 

ఇప్పుడు అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో పేస్ట్ వేసి చిన్న మంట మీద ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ప‌ది నిముషాలు ఉడికించాలి. ఆ తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి కొద్దీ సేపు మగ్గిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకుంటే స‌రిపోతుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ కాజు కుర్మా రెడీ అయినట్లే. 

 

ఈ కాజు కుర్మాను చ‌పాతి, రైస్‌తో తింటే చాలా చాలా బాగుంటుంది. మ‌రియు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడటానికి కిడ్నీ షేప్ లో ఉండే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పును కంప్లీట్ ఫుడ్ ప్యాక్‌గా చెప్పుకోవచ్చు. ఇతర విత్తనాలతో పోలిస్తే జీడిపప్పులో తక్కువ శాతం కొవ్వు ఉంటుంది. అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించే ఒలిక్ ఆసిడ్  కూడా ఇందులో ఉంటుంది. అలాగే జీడిప‌ప్పు వ‌ల్ల మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. కాబ‌ట్టి.. జీడిప‌ప్పుతో ఇలా వెరైటీ ఫుడ్ ఐటెమ్స్ తీసుకుని ఎంజాయ్ చేయండి.

 
 
 

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: