కావాల్సిన ప‌దార్థాలు:
మామిడిపండు- ఒక‌టి
కస్టర్డ్‌ పౌడర్- ఒక‌ టేబుల్‌ స్పూన్‌
వెనీలా- ఒక‌టిన్న‌ర‌ టేబుల్‌ స్పూన్‌
మ్యాంగో ప్యూరీ- ఒక‌ కప్పు

 

ఫుడ్ కలర్- రెండు చుక్కలు
క్రీమ్- రెండు కప్పులు
పంచదార- ఒక కప్పు
పాలు- ఒక‌ కప్పు

 

త‌యారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నెలో క్రీం తీసుకుని.. బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మ‌రియు పావు కప్పు పాలు తీసుకొని వాటిలో కస్టర్డ్‌ పౌడర్‌ కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకుని అందులో మిగిలిన పాలలో పంచదార వేసి వేడి చేయాలి. కాసేపయ్యాక కస్టర్డ్‌ మిశ్రమం వేసి మళ్లీ మరిగించాలి.

 

ఇప్పుడు ఆ మిశ్రమం స్టవ్‌పై నుంచి దింపుకొని కాస్త చల్లారిన తరువాత మ్యాంగో ప్యూరీ, మామిడిపండు ముక్కలు, క్రీమ్‌, వెనీలా, ఫుడ్ కలర్  వేసి బాగా కలుపుకోవాలి. త‌ర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్‌లోకి షిఫ్ట్ చేసుకుని గట్టిగా మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆరు గంట‌ల త‌ర్వాత బాక్స్‌ను బ‌య‌ట‌కు తీసి.. స‌ర్వ్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ మ్యాంగో ఐస్‌క్రీమ్‌ రెడీ అయినట్లే. 

 

ఇంకెందుకు ఆలస్యం.. ఇంట్లో ఓసారి ట్రై చేయండి. వాస్త‌వానికి వేసవి కాలంలో ఎక్కువగా కోరుకునే పదార్థం ఐస్‌క్రీం. ఎందుకంటే మండేఎండ‌ల్లో చల్లటి ఐస్‌క్రీం తింటే ఆ మ‌జానే వేరు. వేసవి సెలవుల్లో చిన్నారులు, యువత వివిధ రకాల ఐస్‌క్రీం తింటూ ఆనందం పొందుతుంటారు. మార్కెట్లో వివిధ రకాలకు సంబంధించిన ఐస్‌క్రీములు లభిస్తున్నాయి. అయితే ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా బ‌య‌ట కాలు పెట్టి ప‌రిస్థితి లేదు.

 

అయితే బయటి నుంచి కాకుండా మన ఇంట్లోనే తయారు చేసేందుకు ప్రయత్నించండి. ఇలాంటి వాటిలో మ్యాంగో ఐస్‌క్రీమ్ ఒకటి. కాబ‌ట్టి.. పైన చెప్పుకున్న టిప్స్ పాటిస్తూ కూల్ కూల్‌గా ఐస్‌క్రీం చేసుకుని.. ఎంజాయ్ చేయండి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: