కావాల్సిన ప‌దార్థాలు:
క్యారెట్- మూడు
పంచదార- ఒక‌టిన్న‌ర క‌ప్పు
చిక్కటి పాలు- ఒక‌ లీటరు

 

యాలకులు పొడి- అర‌ స్పూన్
జీడిపప్పు- ప‌ది
బాదంప‌ప్పు- ఎనిమిది

 

త‌యారీ విధానం: ముందుగా క్యారెట్‌ని తీసుకుని శుభ్రంగా నీటితో క‌డ‌గాలి. ఇప్పుడు వాటిని ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఈ ఉడికిన ముక్కలు, జీడిపప్పు, బాదంప‌ప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. తర్వాత పాలు కాచి, పొంగువచ్చే సమయంలో క్యారెట్ పేస్ట్‌, యాలకుల పొడి వేసి సన్నని మంట మీద అడుగు అంటకుండా కలయతిప్పుతూ ఉండాలి. 

 

ఇలా పదినిమిషాల పాటు తిప్పిన తర్వాత పంచదార వేయాలి. పంచదార కరిగే వరకు తిప్పిన తర్వాత స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారెట్‌ ఖీర్‌ తయారయినట్టే. ఈ ఖీర్‌ను వేడి వేడిగా తీసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. చ‌ల్ల‌గా కావాల‌నుకునేవారు ఫ్రిజ్‌లో పెట్టుకుని కూడా తాగ‌వ‌చ్చు. ఇక క్యారెట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

పిల్లలకు పెద్దలకు ఇష్టమైన వెజిటేబుల్. సూప్స్, సలాడ్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. క్యారెట్లో ఎ, సి, కె, విటమిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులోని ఎ విటమిన్‌ ఊపిరితిత్తులలో కఫం చేరకుండా చేస్తుంది.  అలాగే క్యారెట్ లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్ హార్ట్ డిసీజ్ ను నివారిస్తుంది. ఇక‌ క్యారెట్‌లో రక్తహీనతను పోగొట్టే గుణం ఉంది. రక్తహీనతకు కూడా క్యారెట్‌ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. 

అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్‌లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. అయితే క్యారెట్‌ను క‌ర్రీస్ చేస్తే చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. అందుకే పైన చెప్పిన విధింగా క్యారెట్‌ ఖీర్ చేసి ఇస్తే ఖ‌చ్చితంగా తీసుకుంటారు. కాబ‌ట్టి.. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో క్యారెట్ ఖీర్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి.
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: