కావాల్సిన ప‌దార్థాలు:
మటన్- అర‌ కేజీ
గరం మసాలా పొడి- అర టీ స్పూన్
నిమ్మరసం- ఒక‌ టేబుల్ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

పసుపు- అర‌ టీ స్పూన్
ఉల్లిపాయ- రెండు
మిరప్పొడి- ఒక‌ టీ స్పూన్
జీలకర్ర- ఒక‌ టేబుల్ స్పూన్

 

కరివేపాకు- రెండు రెబ్బ‌లు
కొత్తిమీర త‌ర‌గు- ఒక క‌ప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టేబుల్ స్పూన్‌
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు

 

పుదీనా ఆకులు- పావు క‌ప్పు
నీళ్లు- త‌గి‌న‌న్ని
పచ్చిమిర్చి- నాలుగు

 

త‌యారీ విధానం: ముందుగా మటన్‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మ‌ట‌న్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు కలిపి కొద్దిగా నీటిని పోసి ప్రెషర్ కుకర్‌లో ఐదు నిమిషాల సేపు ఉడికించి ముక్కలను విడిగా తీసి తడిలేకుండా ఆరనివ్వాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసి జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీన వేసి కొద్ది సేపు వేయించాలి. 

 

అవి వేగాక‌ అందులో మటన్ ముక్కలను వేసి బాగా కలపి వేయించాలి. తర్వాత త‌గినంత ఉప్పు, మిరియాలపొడి, గరం మసాలా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు చివ‌రిగా నిమ్మ‌రసం వేసి బాగా క‌లిపి మ‌రో ప‌ది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మ‌ట‌న్ ముక్కులు బాగా ఫ్రై అయిన త‌ర్వాత స్ట‌వ్ ఆప్ చేస్తే స‌రిపోతుంది. అంటే ఎంతో రుచిక‌ర‌మైన మ‌ట‌న్ ఫ్రై రెడీ అయిన‌ట్లే. 

 

దీన్ని వేడి వేడి రైస్‌లో తింటే ఆ టేస్టే వేరు. ఇక మ‌ట‌న్ విష‌యానికి వ‌ప్తే.. మటన్‌లో అధికంగా ప్రోటీన్లు ఉంటాయి. ఐరన్‌ ఉంటుంది. ఫ్యాట్‌ తక్కువ ప్రమాణాల్లో ఉంటుంది. శరీరానికి అవసరమయ్యే పోషకవిలువలు మటన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది మంచి పౌష్టికాహారం. మటన్‌ని సరైన మోతాదులో తింటే ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. అయితే ఎప్పుడు ఒకేలా తింటే ఎంత‌టి నాన్‌వెజ్ ప్రియుల‌కైనా బోర్ కొడుతుంది. కాబ‌ట్టి.. పైన చెప్పిన‌ట్టు మ‌ట‌న్ ఫ్రై ఓ సారి ట్రై చేసి చూడండి.

 

  

 

మరింత సమాచారం తెలుసుకోండి: