కావాల్సిన ప‌దార్థాలు: 
చికెన్- అర‌ కేజీ
మసాలా పౌడర్‌- ఒక టేబుల్‌ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు టేబుల్ స్పూన్స్
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

ఎగ్స్- మూడు
ఉల్లిపాయ‌లు- రెండు 
పచ్చిమిర్చి- మూడు 
ఉప్పు- రుచికి స‌రిప‌డా
ప‌సుపు- అర టీ స్పూన్‌

 

నూనె- త‌గినంత‌
కరివేపాకు- నాలుగు రెబ్బలు
కారం- ఒక టేబుల్‌ స్పూన్
పుదీనా త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్ హార్ట్స్‌, లివర్ ను చిన్ని చిన్న ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి వాటిని కడిగి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి కొంచెం నూనె పోసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కాసేపు వేగ‌నివ్వాలి. తర్వాత చికెన్ హార్ట్స్‌, లివర్ వేసి క‌లుపుకోవాలి.

 

ముక్క‌లు గట్టి పడేవరకు వేయించుకోవాలి. బాగా వేయగాక పసుపు, కారం, ఉప్పు వేయండి. మ‌రో పది నిమిషాల త‌ర్వాత‌‌ అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్ వేసి కాసేపు వేగాక.. చివరగా కొత్తిమీర, పుదీనా చ‌ల్లి ఐదు నిమిషాల త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అంతే వేడి వేడి చికెన్ హార్ట్ ఫ్రై రెడీ అయినట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది.

 

చికెన్ హార్ట్స్‌లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చాలా సన్నగా ఉన్న వారికి తగినంత బలాన్ని చేకూర్చుతుంది. అలాగే చికెన్ హార్ట్‌లో చాలా రకాల పోషకాంశాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. కాబ‌ట్టి, ఈ లాక్‌డౌన్ వేళ ఖ‌చ్చితంగా చికెన్ హార్ట్ ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మ‌రియు దీన్ని పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

   

మరింత సమాచారం తెలుసుకోండి: