కావాల్సిన ప‌దార్థాలు:
మటన్- ఒక‌ కేజీ
మున‌క్కాయ ముక్కలు- ఒక‌ కప్పు
కరివేపాకు- మూడు రెబ్బలు
అల్లంవెల్లుల్లి పేస్ట్- రెండు స్పూన్లు
ఉల్లిపాయ త‌రుగు- ఒక‌ కప్పు

 

టమాటా- ఒక‌టి
కొబ్బరి పేస్ట్‌- రెండు స్పూన్లు
దాల్చిన చెక్క- చిన్న ముక్క
లవంగం పొడి- అర టీ స్పూన్

 

పసుపు- అర‌ స్పూన్
ఉప్పు- రుచిక స‌రిప‌డా
కారం- రెండు టీ స్పూన్లు

 

యాలకుల పొడి- అర టీ స్పూన్
గరం మసాలా పొడి- ఒక టీ స్పూన్
నూనె- త‌గినంత‌
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: ముందుగా మ‌ట‌న్‌ను నీటితో శుభ్రం చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తరవాత కారం, కొబ్బరి పేస్ట్, లవంగాల పొడి, దాల్చిన చెక్క, యాలకుల పొడి వేసి మిక్స్ చేయాలి.

 

ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న‌ మటన్ ముక్కలు వేసి కొద్దిగా మగ్గిన తరువాత ఉప్పు వేసి వేగనివ్వాలి. తరువాత మునగకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి సరిపడా నీళ్ళు పోసి పావు గంట పాటు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి గరం మసాలా వేసి మరో ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి. మ‌ట‌న్ బాగా ఉడికింది అనుకున్నాక‌.. చివ‌రిలో కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఆగి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. 

 

ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే వేడి వేడి ములక్కాయ మటన్ కర్రీ రెడీ అయినట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ లాక్‌డౌన్ టైమ్‌లో మీరు కూడా ములక్కాయ మటన్ కర్రీ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: