కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్‌- ఒక‌ కిలో
కశ్మీరీ కారం- రెండు స్పూన్లు
ధనియాల పొడి- ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర- అర టీ స్పూన్

 

అల్లం వెల్లుల్లి- మూడు టీ స్పూన్లు
ఉల్లి తరుగు- రెండు కప్పులు
ఎండు మిర్చి- నాలుగు

 

యాలకులు- మూడు
ఉప్పు- రుచికి త‌గినంత‌
నూనె- ఆరు టేబుల్‌ స్పూన్లు
కొత్తిమీర- ఒక క‌ట్ట‌

 

దాల్చిన చెక్క- చిన్న ముక్క
జీడిపప్పు- ఎనిమిది
బాదం- ఎనిమిది
పెరుగు- ఒక కప్పు

 

త‌యారీ విధానం: ముందుగా చికెన్ ముక్క‌ల‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి.. ఉప్పు కలిపి పక్కనబెట్టుకోవాలి. తర్వాత స్ట‌వ్ ఆన్ చేసిన పాన్ పెట్టుకుని ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు విడివిడిగా వేయించాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసికుని పొడి చేసుకుని.. అందులోనే కాశ్మీరీ కారంలో వేసి కలపాలి. అలాగే జీడిపప్పు, బాదం పలుకులు కూడా సన్నని సెగ మీద దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. 

 

తర్వాత ఒక పాన్ లో నూనె వేసి అందులో ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకదాని తర్వాత ఒకటి వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు అందులో చికెన్‌ ముక్కలు వేసి సన్న మంటపై ప‌ది నిమిషాలు ఉంచాలి. తర్వాత సిద్ధం చేసుకొన్న గరం మసాలా పొడి, ఉప్పు కలిపి మరో ఐదు నిమిషాలు మ‌గ్గించి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలో అందులో జీడిపప్పు, బాదం పొడి కలపాలి. 

 

ముక్క మెత్తబడగానే పెరుగు కలిపి సన్నని మంట మీద ప‌ది నిమిషాలు ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఇక చివ‌రిగా కొత్తిమీర కూడా చల్లి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. దీన్ని స‌ర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటే స‌‌రిసోతుంది. అంతే టేస్టీ టేస్టీ కశ్మీరీ చికెన్ రెడీ అయినట్లే. దీన్ని వేడివేడిగా రొట్టె, నాన్‌, బ్రెడ్, రైస్  ఇలా దేనితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది. మ‌రి ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఎంతో సులువైన కశ్మీరీ చికెన్ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: