కావాల్సిన ప‌దార్థాలు: 
కాకరకాయలు- ఒక‌‌ కేజీ
నూనె- వేయించడానికి సరిపడా
నిమ్మకాయ- ఒక‌టి
మిరియాలపొడి- ఒక టీ‌ స్పూన్

 

కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
ఉప్పు- రుచికి త‌గినంత‌
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: ముందుగా కాకరకాయల్ని నీటిలో శుభ్రంగా కడిగి చక్రాల్లా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బైల్‌లో నిమ్మరసం పిండి, ఉప్పు కలిపి కాకరగాయ ముక్కల్ని అందులో వేసి కలిపి తీసి గంటన్నర పాటు మంచి ఎండలో ఎండనివ్వాలి. ముక్కలు ఎండకు వాడిన తర్వాత వాటిని కాగిన నూనెలో గుప్పెడు గుప్పెడు చొప్పున వేసి వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. 

IHG

ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర‌ నూనెలో కరకరలాడేలా వేయించి కాకరగాయ ముక్కలమీద వేసి కలుపుకోవాలి. చివరగా కాకరకాయ చిప్స్ మీద మిరియాలపొడి,  ఉప్పు, కారం చల్లుకోవాలి. ఎండాకాలంలో ఒకేసారి ఎక్కువ ముక్కలను ఎండబెట్టుకొని డబ్బాలో నిల్వచేసుకోగలిగితే ఏడాదిపొడవునా బుద్ధిపుట్టినప్పుడల్లా కాసిని వేయించుకు తినొచ్చు. అంతే టేస్టీ టేస్టీ కాక‌ర‌కాయ చిప్స్ రెడీ అయిన‌ట్లే. ఒక్క‌సారి వీటిని తింటే మ‌ళ్లీ మళ్లీ తినాల‌నిపిస్తుంటుంది. 

IHG

ఎందుకంటే.. అంత టేస్టీగా ఉంటాయి కాబ‌ట్టి. సో.. ఈ కాకరకాయ చిప్స్‌ను త‌ప్ప‌కుండా ట్రై చేయండి. ఇక కాక‌రకాయ విష‌యానికి వ‌స్తే.. చేదుగా ఉంటుందన్న కారణంగా చాలా మంది కాకరకాయను ఇష్టపడరు. చేదుగా ఉన్నా...ఇందులో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే వైద్యులు కూడా ఆరోగ్యానికి మేలుచేసే కాకరకాయలను రెండు వారాలకు ఒక్కసారైనా తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. పోని కాక‌ర‌కాయ క‌ర్రీని తిన‌లేని వారు పైన చెప్పిన విధంగా కాకరకాయ చిప్స్‌ను కూడా చేసుకుని తిన‌వ‌చ్చు. ఇంకెందుకు ఆల‌స్యం లేట్ చేయ‌కుండా లాక్‌డౌన్ టైమ్‌లో ఈ రెసిపీని ట్రై చేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: