కావాల్సిన ప‌దార్థాలు:
చిక్కటి పాలు- రెండు లీటర్లు
నెయ్యి- ఒక‌ టీ స్పూను
నిమ్మరసం- రెండు టేబుల్‌ స్పూన్లు

 

మిల్క్‌పౌడర్- అర‌ కప్పు
కండెన్స్‌డ్‌ మిల్క్- అర‌ కప్పు
జీడిప‌ప్పు- ప‌ది
బాదంప‌ప్పు- ప‌ది

 

యాలకుల పొడి- అర ‌టీ స్పూను
పాలు- పావు కప్పు 
క్రీమ్‌- పావు కప్పు

 

త‌యారీ విధానం: ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి.. మంద‌పాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో రెండు లీట‌ర్ల పాలు పోసి బాగా మరిగించాలా. ఆ త‌ర్వాత అందులో నిమ్మరసం కలపాలి. ఇప్పుడు పాలు విరిగిపోతాయి. పాలు పూర్తిగా విరిగిన తర్వాత వడకట్టి పక్కనుంచాలి. ఇప్పుడు పాన్‌లో నెయ్యి వేసి పావు క‌ప్పు పాలు పోయాలి. ఆ తర్వాత క్రీమ్‌ వేసి బాగా మిక్స్ చేయాలి.

 

తర్వాత మిల్క్‌ పౌడర్‌ వేసి ఉండలు చుట్టకుండా తిప్పుతూ.. చిక్కబడ్డాక చిదిమిన పన్నీర్‌ వేసి చిన్నమంటపై ఐదు నుంచి ప‌ది నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి మీడియం మంటలో అడుగంటకుండా కలపాలి. పూర్తిగా చిక్కబడ్డాక యాలకుల పొడి కలిపి స్ట‌వ్ ఆప్ చేయాలి. గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టుకోవాలి. చివ‌రిగా ల‌డ్డూల‌పై బాదం, జీడిప‌ప్పు ముక్క‌లు జ‌ల్లి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

 

అంతే య‌మ్మీ య‌మ్మీ పన్నీర్‌ లడ్డు రెడీ అయినట్లే. ఇక పాల‌తో త‌యారు చేసే పన్నీర్ గురించి చాలా మందికి తెలుసు. దీన్ని వెజ్‌, నాన్ వెజ్ ప్రియులు అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందైతే పన్నీర్ ను పచ్చిగానే ఇష్టపడతారు.

 

పన్నీర్ నిత్యం తీసుకుంటుంటే హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గి, రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. ఇంకా మ‌రెన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్న ఈ ప‌న్నీర్‌తో పైన చెప్పిన విధంగా లడ్డూలు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: