కావాల్సిన ప‌దార్థాలు: 
బ్రెడ్ ముక్కలు- ఆరు
పాలు- రెండు కప్పులు
నెయ్యి- రెండు టీస్పూన్

 

కుంకుమపువ్వు- చిటికెడు
కండెన్స్‌డ్ మిల్క్- ఒక టేబుల్ స్పూన్లు
పంచదార- అర కప్పు

 

యాలకుల పొడి- అర‌ టీ స్పూన్
జీడిప‌ప్పు- ప‌ది
బాదాంప‌ప్పు- ప‌ది
పిస్తాప‌ప్పు- ప‌ది

 

త‌యారీ విధానం: ముందుగా ఒక‌ గిన్నె తీసుకుని లోపల చుట్టూ నెయ్యి రాసి.. అందులో పాలు, కండెన్స్‌డ్ మిల్క్‌ పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాల గిన్నెను పెట్టి మీడియం మంటలో మ‌రిగించాలి. మిశ్రమం సగం అయ్యే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండండి. అలా అయిన తర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ప‌క్క‌న పెట్టుకోవాలి.

IHG

ఇప్పుడు స్ట‌వ్‌పై మ‌రో గిన్నెలో పాలు పోసి కాస్త మ‌రిగిన త‌ర్వాత‌ అందులో కుంకుమపువ్వు వేసి ఉడికించాలి. ఆ త‌ర్వాత‌ పంచదార వేసి కలుపుతూ ఉండండి. దీనినే రబ్రీ అంటారు. మ‌రోవైపు నట్స్‌ను నెయ్యిలో వేయించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ న‌ట్స్‌ను రబ్రీలో వేసి బాగా కలపండి. త‌ర్వాత‌ ఈ మిశ్రమానికి యాలకుల పొడి కూడా చేర్చి.. చిక్కగా అవ్వగానే స్టవ్ ఆపేసి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టండి. 

IHG

ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తీసుకుని వాటి చివరల్ని తీసేసి గుండ్రంగా కట్ చేయండి. ఆ త‌ర్వాత ముందుగా ప‌క్క‌న పెట్టుకున్న‌ పాలలో రబ్రీని మిక్స్ చేయండి. అలాగే ఈ మిశ్ర‌మంలో గుండ్రంగా ఉన్న బ్రెడ్ ముక్కల్ని కూడా వేస్తె నోరూరించే బ్రెడ్ రసమలై రెడీ అయినట్లే. దీనిని ఫ్రిజ్‌లో పెట్టి చల్లగా అయ్యాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ య‌మ్మీ య‌మ్మీ బ్రెడ్ రసమలైను పిల్ల‌లు కూడా ఇష్టంగా తింటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: