కావాల్సిన ప‌దార్థాలు: 
పచ్చికొబ్బరి తురుము- ఒక‌ కప్పు
చక్కెర- ఒక‌ కప్పు
చిక్కనిపాలు- ఒక కప్పు

 

యాపిల్ తురుము- ఒక క‌ప్పు
నెయ్యి- మూడు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి- అర‌ స్పూన్

 

జీడి ప‌ప్పు- ప‌ది
బాదం ప‌ప్పు- ప‌ది
పిస్తా ప‌ప్పు- ఎనిమిది

 

త‌యారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో పాలు, చక్కెర, యాపిల్‌ తురుము వేసి స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద ప‌ది నిమిషాలు ఉడికించాలి. ఆ మిశ్రమం చిక్కబడేటప్పుడు డ్రైఫ్రూట్స్‌,  కొద్దిగా నెయ్యి కలిపి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకులపొడి వేసి మరోసారి కలిపి మరి కొద్దిగా నెయ్యి వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి.

IHG's Kitchen

ఐదు నిమిషాల త‌ర్వాత స్ట‌వ్ అఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, సులువైన‌ వేడివేడి యాపిల్‌ కొబ్బరి బర్ఫీ రెడీ అయినట్లే. కావాలనుకునేవారు దీన్ని ముక్కలుగా కోసుకొని చివరలో మరికొన్ని డ్రై ఫ్రూట్స్ పలుకులు చల్లి ఆరిన తర్వాత తినొచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి. అంతేకాదు, పిల్ల‌లు కూడా యాపిల్‌ కొబ్బరి బర్ఫీని ఎంతో ఇష్టంగా తింటారు.

IHG

ఇక ప్ర‌స్తుతం ఎలాగో లాక్‌డౌన్ వ‌ల్ల ఇంట్లోనే ఉంటున్నారు. పిల్ల‌లు కూడా ఏదో ఒక‌టి చేయ‌మ‌ని అడుగుతుంటారు. అలాంటి టైమ్‌లో ఇలాంటి సులువైన ఐటెమ్స్ చేసుకుంటే చాలా బాగుటుంది. కాబ‌ట్టి.. పైన చెప్పిన విధంగా ఓ సారి యాపిల్‌ కొబ్బరి బర్ఫీ త‌యారు చేసికుని ఎంజాయ్ చేసేయండి. 

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: