కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి రైస్- ఒక‌ కప్పు
స్వీట్ కార్న్- ఒక‌ కప్పు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు

 

గరం మసాలా- పావు టీ స్పూన్
జీలకర్ర- అర టీ స్పూన్
పసుపు- అర టీ స్పూన్
కారం- ఒక టీ స్పూన్

 

నిమ్మరసం- ఒక‌టి
యాలకులు- రెండు
లవంగాలు- మూడు
బటాణీలు- ఒక‌ కప్పు

 

ఉల్లి పాయ త‌రుగు- ఒక క‌ప్పు
అల్లం- చిన్న ముక్క
పచ్చి మిర్చి- రెండు
వెల్లుల్లి రెబ్బలు- మూడు
ఉప్పు- రుచికి త‌గినంత‌

 

దాల్చిన చెక్క- చిన్న ముక్క
పుదీనా త‌రుగు- ఒక క‌ప్పుడు
బిర్యాని ఆకులు- రెండు
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కలిపి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, లవంగాలు, బిర్యాని ఆకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ ని వేసి దానికి కారం, పసుపు, గరం మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. 

IHG

తరువాత స్వీట్ కార్న్, బటాణి లు వేసి దోరగా వేయించాలి. అందులోనే బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి తగినంత ఉప్పు, నాన బెట్టిన రైస్ వేసి ఉడికించాలి. చివరిగా కొత్తిమ‌ర‌, నిమ్మరసం పిండి స్ట‌వ్ అఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే ఎంతో సులువుగా వేడి వేడి స్వీట్ కార్న్ పలావ్ రెడీ అయిన‌ట్లే. 

IHG

దీన్ని చిన్న పిల్ల‌లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో.. త‌ప్ప‌కుండా పైన చెప్పిన విధంగా స్వీట్ కార్న్ పులావ్ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేసేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: