కావాల్సిన ప‌దార్థాలు:
బీన్స్- అర‌ కేజీ
కొబ్బరి తురుము- ఐదు టేబుల్ స్పూన్లు
నువ్వులు- మూడు టేబుల్ ‌స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు- నాలుగు

 

ఆవాలు- ఒక టీ స్పూన్‌
కరివేపాకు- నాలుగు రెబ్బ‌లు
పసుపు- అర‌ టీస్పూన్‌

 

నూనె- రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత
కారం- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
జీలకర్ర- ఒక టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా బీన్స్ ను నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి. తరువాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని.. వేడి అయ్యాక‌ నువ్వులు, జీలకర్ర, కొబ్బరి తురుము వేసి వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేగించాలి. 

 

తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌, పసుపు వేసి కాసేపు బాగా క‌ల‌పాలి. చిన్న మంటపై పదినిమిషాల పాటు వేగించాలి. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న మసాల వేయాలి. ఆ త‌ర్వాత తగినంత ఉప్పు వేసి, మరికాసేపు ఉడికించుకుని స్ట‌వ్‌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే వేడి వేడి బీన్స్‌ కొబ్బరి ఫ్రై రెడీ అయిన‌ట్లే. బీన్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను సమతుల్యం చేయాలంటే, బీన్స్ లోని కార్బోహైడ్రేట్స్ అద్భుతంగా సహాయపడుతాయి. 

 

బీన్స్ పుష్కలమైన న్యూట్రీషియన్స్ కాంబినేషన్ కలిగినటువంటి ఆహారపదార్థం. ఇందులో యాంటీఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, ఫైబర్, కాంప్లెక్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ మరియు మినిరల్స్ ఇలా ఆరోగ్యానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని పోష‌కాలు ఉంటాయి. ఇక కొబ్బ‌రి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిద‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా  అధిక లావు తగ్గాలి అంటే, ఆరోగ్యంగా, చలాకీగా ఉండాలి అంటే లేత కొబ్బరి తినాలని అంటున్నారు నిపుణులు. అయితే కొబ్బ‌రిని విడిగా తిన‌లేని వారు ఇలా క‌ర్రీ రూపంలో తీసుకున్నా మంచిదే.

మరింత సమాచారం తెలుసుకోండి: