కావాల్సిన ప‌దార్థాలు:
కందిపప్పు- ఒక‌ కప్పు
తెలగపిండి- అర కప్పు
మినప్పప్పు- అర‌ టీ స్పూన్

 

ఎండుమిర్చి- నాలుగు
ఇంగువ-చిటికెడు
వెల్లుల్లి రేకలు- నాలుగు

 

కరివేపాకు- మూడు రెబ్బలు
 ఆవాలు- అర‌ టీ స్పూన్
జీలకర్ర- అర‌ టీ స్పూను

 

త‌యారీ విధానం:
ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గెన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు నీరు పోసి మరిగించాలి. ఇప్పుడు మ‌రిగించిన నీరులో తెలగపిండి వేసి మూతపెట్టి మెత్తగా ఉడికించి చల్లార్చి ఆరబెట్టాలి. త‌ర్వాత‌ మరో గిన్నెలో కందిపప్పు ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. 

IHG

తర్వాత ఉప్పు, తెలగపిండి, కందిపప్పు వేసి బాగా కలిపి ప‌ది నిమిషాలు మ‌గ్గించుకోవాలి. కూర బాగా మ‌గ్గిన త‌ర్వాత  స్టవ్ ఆపేసి సర్వ్ చేస్తే వేడి వేడి కంది పప్పు తెలగపిండి రెడీ అయినట్లే. ఇది తిన‌డానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక కందిపప్పు విష‌యానికి వ‌స్తే.. ఇది ఆరోగ్య‌నికి ఎంతో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  అన్ని పప్పుల్లో కందిపప్పు బాగా ప్రసిద్ది చెందిన పప్పు. 

IHG

ముఖ్యంగా ఇండియాలో వీటిని ఎక్కువగా తింటారు. ఇది కాంప్లెక్స్ డైటరీని పుష్కలంగా అంధిస్తుంది. మరియు బౌల్ మూమెంట్ క్రమబద్దం చేస్తుంది. కందిపప్పులో ఫోలిక్ యాసిడ్, విటమిన్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే తెలగపిండి కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. మ‌రి అలా కందిపప్పు, తెలగపిండి కాంబినేష‌న్ క‌ర్రీ ఖ‌చ్చితంగా టేస్ట్ చేయాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: