కావాల్సిన ప‌దార్థాలు:
మ‌ష్రుమ్- రెండు కప్పులు
పచ్చిబఠాణి- ఒక‌ కప్పు
టమోటా తరుగు- ఒక‌ కప్పు
ఉల్లిపాయ త‌రుగు- ఒక క‌ప్పు

 

ధనియాల పొడి- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
మిరియాలపొడి- అర టీ స్పూన్‌
అల్లం ముక్కలు- ఒక‌ టీ స్పూన్‌

 

నిమ్మరసం- ఒక‌ టీ స్పూను
కసూరీ మేతీ- రెండు టేబుల్‌ స్పూన్లు
నూనె- మూడు టేబుల్‌ స్పూన్లు

 

జీలకర్ర- అర‌ టీ స్పూన్‌
పసుపు- అర టీ స్పూన్‌
కారం- ఒక టీ స్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

త‌యారీ విధానం:
ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో నూనె వేసి వేడి అయ్యాక‌ జీలకర్ర, టమోటా తరుగు, ఉల్లిపాయ త‌రుగు, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక అందులో ఉప్పు, ధనియాల పొడి, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి చిన్నమంటపై వేగించాలి. టమోటాలు మెత్తబడ్డాక తరిగిన మ‌ష్రుమ్స్‌‌(పుట్టగొడుగులు), పచ్చిబఠాణీ వేసి బాగా క‌లిపి మూత పెట్టాలి. 

 

ఈ మిశ్ర‌మం సగం ఉడికిన తర్వాత కసూరిమేతీ వేసి ఐదు నిమిషాలు ఉంచాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీరు పోసి మష్రఉమ్స్‌, బఠాణీలు పూర్తిగా మెత్తబడే వ‌ర‌కు ఉడికించుకోవాలి. ఇప్పుడు చివ‌రిగా నిమ్మరసం పిండి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే వేడి వేడి మ‌ష్రుమ్ ప‌చ్చిబ‌ఠాణీ క‌ర్రీ రెడీ అయిన‌ట్లే. ఈ క‌ర్రీ రైస్ లేదా పరాటా కాంబినేష‌న్‌తో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసెపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

ఇక సాధారణంగా మష్రుమ్ లను వెజిటేరియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతారు. హ‌ష్రుమ్ మంచి పౌష్టికాహారం. ఎందుకంటే వీటిలో అపారమైన పోషకాలున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం అవుతాయి. అంతే కాదు ఫైబర్ కు అద్భుతమైన మూలం. మష్రుమ్స్‌ ప్రాచీనకాలం నుండి ఒక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది తక్కువ క్యాలరీలున్న ఆహారం పదార్థం. 

   

 

మరింత సమాచారం తెలుసుకోండి: