కావాల్సిన ప‌దార్థాలు:
బ్రెడ్‌ ముక్కలు- ఎనిమిది
ఉల్లిపాయ- ఒకటి
క్యాప్సికమ్- ఒకటి
వెల్లుల్లి రెబ్బ‌లు- నాలుగు

 

అల్లం పేస్ట్‌- ఒక టీ స్పూన్‌
మొక్కజొన్నపిండి- మూడు టేబుల్‌ స్పూన్లు
మైదాపిండి- ఒక టేబుల్‌ స్పూన్‌
నూనె- స‌రిప‌డా

 

పెప్పర్ - అర టీ స్పూన్
పచ్చిమిరపకాయలు- మూడు
పంచదార- అర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి తగినంత

 

సోయాసాస్ - ఒక టేబుల్‌ స్పూన్
వెనిగర్ - అర టీ స్పూన్‌
కారం- అర టీ స్పూన్‌
అజీనామోటో- పావు టీ స్పూన్‌

 

త‌యారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, పెప్పర్‌, ఉప్పు, సరిపడా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్‌ పెట్టి నూనె వేసి.. వేడెక్కాక‌ బ్రెడ్‌ ముక్కల్ని పిండిలో ముంచి అందులో వేసి సన్నమంటపై వేగించాలి. రెండువైపులా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలి.

IHG

ఇప్పుడు వేగించుకున్న బ్రెడ్‌ను చిన్నముక్కలుగా కట్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నూనె పోసి కాగాక వెల్లుల్లి రెబ్బ‌లు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంపేస్ట్‌, క్యాప్సికమ్‌ ముక్కలు వేసి వేగించాలి. 

IHG

తర్వాత సోయాసాస్‌, వెనిగర్‌, కారం, అజీనామోటో, పంచదార, ఉప్పు వేసి బాగా కలిపి సన్ననిమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించిన బ్రెడ్‌ ముక్కల్ని కూడా వేసి మరో పదినిమిషాలు వేగించి.. చివ‌రిగా కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆప్ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, సులువైన బ్రెడ్‌ మంచూరియా రెడీ అయిన‌ట్లే. ఈ టేస్టీ రెసిపీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: