అసలే  ఆదివారం ముక్క లేనిదే భోజనం సహించదు. చికెన్ కూరలో జీడిపప్పు కలిపి వండుకుంటే ఆ రుచే వేరు. ఇప్పుడు రుచికరమైన  మైన జీడిపప్పు మసాలా చికెన్ కూర ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో  ఇప్పుడు తెలుసుకుందాం.
కావలిసిన పదార్ధాలు :
చికెన్ - 1/2 kg
 తరిగిన ఉల్లిపాయలు- రెండు 
నూనె - తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్ట్- మూడు చెంచాలు 
జీలకర్ర-కొద్దిగా 
ఉప్పు- రుచికి సరిపడా 
పసుపు-చిటికెడు 
కారం- 2 టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర-కొద్దిగా 
చికెన్ మసాలా-2 టేబుల్ స్పూన్లు 
జీడిపప్పు-15
ఎండుమిర్చి-3
సెనగపప్పు- 2 టేబుల్ స్పూన్లు 
ధనియాలు-2 టేబుల్ స్పూన్లు 

తయారు చేసే విధానం :-


ముందుగా మసాలా తయారు చేసుకోవడానికి జీడిపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా సెనగ పప్పు , ధనియాలు కడాయిలో వేసి వేయించాలి. వేయించిన జీడిపప్పు, ఎండుమిర్చి,సెనగ పప్పు , ధనియాలు ఒక చిన్న అల్లం ముక్క , నాలుగు వెల్లుల్లి రెబ్బలు ,మిక్సీ జాడీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె పోసి వేడయ్యాక జీలకర్ర వేసి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి.అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేయాలి తర్వాత చికెన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిముషాలు వేగనివ్వాలి.ఆ తర్వాత కొద్దిగా కారం (మసాలా తయారీలో ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగా వేసుకోవాలి ),తగినంత ఉప్పు వేసి కలపాలి.రెండు నిమిషాల తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ను వేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కగా కలపాలి.పది నిముషాలు ఉడికించుకోవాలి .చివరగా కొత్తిమీర వేసి దించుకోవాలి.జీడిపప్పు మసాలా చికెన్ కూర రెడి.దీన్ని అన్నంలోకి తిన్న ,చపాతీలోకి తిన్న చాలా రుచి గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: