కావాల్సిన ప‌దార్థాలు:
పనీర్- 300 గ్రాములు
జీలకర్ర- ఒక టీ స్పూన్‌
పసుపు- ఒక‌ టీస్పూన్‌

 

పచ్చి బఠాణీ- ఒక క‌ప్పు
అల్లం ముక్క- చిన్న ముక్క
పచ్చిమిర్చి- మూడు 
టొమాటోలు- రెండు

 

గరంమసాలా- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్స్
ధనియాల పొడి- ఒక టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా పనీర్‌, టొమాటోలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక పనీర్‌ ముక్కలు వేసి వేగించాలి. పనీర్‌ ముక్కలు గోధుమరంగులోకి మారే వరకు వేగించుకుని పక్కన పెట్టాలి. తర్వాత అదే పాన్‌లో జీలకర్ర, అల్లం, పసుపు, ధనియాలపొడి, పచ్చిమిర్చి వేసి వేగాక టొమాటో ముక్కలు వేసి చిన్నమంటపై ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి. 

 

ఇప్పుడు అందులో కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఆ త‌ర్వాత‌ బఠాణీలు వేసి ఉడకనివ్వాలి. తరువాత పనీర్‌ ముక్కలు, గరంమసాలా వేయాలి. ఒక ప‌ది నిమిషాల త‌ర్వాత కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పనీర్ క‌ర్రీ రెడీ అయినట్లే. రైస్ లేదా రోటీ లేదా నాన్‌తో ప‌నీర్ క‌ర్రీ కాంబినేష‌న్ అదిరిపోతుంది. సో.. ఈ టేస్టీ రెసిపీని త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

శాకాహారులు, మాంసాహారులు సమానంగా ఇష్టపడే ఆహారం ప‌నీర్‌. పాలనుంచి తయారయ్యే పనీర్ లో అనేక పోషకాలుండి ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమందైతే పనీర్ ను పచ్చిగానే ఇష్టపడతారు. పన్నీర్ నిత్యం తీసుకుంటుంటే హృద్రోగాలు వచ్చే అవకాశాలు తగ్గి, రక్తపోటు, లిపిడ్ శాతాలు కూడా అదుపులో ఉంటాయి. అందుకే పైన చెప్పిన విధంగా ప‌నీర్ క‌ర్రీని మీరు ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: