కావాల్సిన ప‌దార్థాలు: 
అరటికాయ- ఒకటి
క్యారెట్‌ తురుము- ఒక కప్పు
బియ్యం పిండి- ఒక‌ కప్పు

 

ఉల్లిపాయ ముక్క‌లు- ఒక క‌ప్పు
వెల్లుల్లి రెబ్బలు- ఐదు
పచ్చిమిర్చి- ఆరు
జీలకర్ర- ఒక టీ స్పూన్‌

 

నూనె- వేయించడానికి సరిపడా 
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

త‌యారీ విధానం:
ముందుగా అర‌టికాయ‌ను తొక్క‌తో ఉడ‌క‌బెట్టి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొద్దిగా ఉప్పును వేసి పేస్టులా చేసుకోవాలి. తర్వాత ఓ గిన్నెలో ఉడికించిన అరటికాయను తొక్క తీసి ముక్కలుగా కోసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో క్యారెట్‌ తురుము, తగినంత బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి.

IHG

ఈ మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న పేస్టుతో పాటు తగినంత ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల పిండిలా కలుపుకోవాలి. ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. అనంత‌రం ముందుగా రెడీ చేసి పెట్టుకున్ని పిండి మిశ్రమాన్ని వ‌డ‌ల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

IHG

అంతే ఎంతో రుచికరమైన అరటికాయ క్యారెట్ వ‌డ‌ రెడీ అయినట్లే. టమాటా సాస్‌తో తింటే మరింత రుచిగా ఉంటాయి. అలాగే పిల్ల‌ల‌కు సాయంత్రపు స్నాక్స్‌గా వీటిని పెడితే.. ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేసి.. టేస్ట్ చేయండి. 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: