కావాల్సిన ప‌దార్థాలు: 
చేపముక్కలు- ఐదు
కొబ్బరి పాలు- ఒక‌ కప్పు
ఉల్లిపాయ పేస్ట్- అర క‌ప్పు

 

జీలకర్ర పొడి- ఒక టీ స్పూన్‌
కారం- ఒక‌టిన్న‌ర టీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- రెండు టీ స్పూన్లు

 

పచ్చిమిర్చి పేస్ట్‌- ఒక టీ స్పూన్‌
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
ఉప్పు- రుచికి త‌గినంత‌
బిర్యానీ అకు- రెండు

 

పసుపు- అర టీ స్పూన్‌
గరం మసాలా పొడి- అర‌ స్పూన్‌
జీలకర్ర- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర‌- ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం:
ముందుగా చేప ముక్కలను నీటిలో శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత ఒక బౌల్‌లో చేప ముక్క‌లు వేసి.. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్క‌ల‌కు బాగా పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక‌.. చేప ముక్కలను నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి. అయితే ముక్కలను మరీ ఎక్కువగా వేయించకూడదు. 

 

ఫ్రై చేసిన తర్వాత... చేపముక్కలను మరో ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత... జీలకర్ర, బిర్యానీ అకు వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్, ప‌చ్చిమిర్చి పేస్ట్‌ వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే జీలకర్ర పొడి, కారం వేసి కాసేపు వేయించాలి. ఆ త‌ర్వాత అందులో కొబ్బరి పాలను పోసి కలుపుతూ ఉండాలి. 

 

ఒక ఐదు నిమిషాల త‌ర్వాత‌ అందులో చేప ముక్కలు వేసి క‌లుపుకోవాలి. మ‌రియు తగినంత ఉప్పు కూడా వేసి చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివరిగా అందులో గరం మసాలా పొడి మ‌రియు కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కొబ్బ‌రి పాల‌తో ఫిష్ క‌ర్రీ రెడీ అయినట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. మ‌రి.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: