కావాల్సిన ప‌దార్థాలు:
శెనగపిండి- ఆరు కప్పులు
బంగాళాదుంప ముక్క‌లు- ఒక క‌ప్పు
క్యాప్సికమ్ ముక్క‌లు- అర క‌ప్పు

 

టమాటో ముక్క‌లు- ఒక క‌ప్పు
ఉల్లిపాయ ముక్క‌లు- ఒక క‌ప్పు
డ్రై మ్యాంగో పొడి- రెండు టీ స్పూన్లు
కారం- ఒక టీస్పూను

 

ఉప్పు- రుచికి సరిపడా
నూనె- తగినంత
కొత్తిమీర త‌రుగు- ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా టమాటో ముక్క‌ల‌ను మిక్సీ జార్‌లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత బంగాళ‌దుంపల‌ను ఉడ‌క‌బెట్టి పొట్టు తీసేయాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఆ త‌ర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో.. శెనగపిండి, ఉల్లిపాయ ముక్క‌లు, బంగాళాదుంప ముక్క‌లు, క్యాప్సికమ్ ముక్క‌లు, ట‌మాటో పేస్ట్ మ‌రియు కొద్దిగా నీళ్లు పోసి క‌లుపోకోవాలి.

IHG

ఆ త‌ర్వాత అందులో ఉప్పు , కారం, డ్రై మ్యాంగో పొడి మ‌రియు కొత్తిమీర త‌రుగు వేసి ప‌కోడీ పిండిలా క‌లుపుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడి అయ్యాక‌.. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్ర‌మాన్ని పకోడీల్లా వేసుకోవాలి.

IHG

ఆ త‌ర్వాత ప‌కోడీల‌ను మంచి క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని స‌ర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే స‌రిపోతుంది. అంతే వేడి వేడి వెజిటబుల్ పకోడీ రెడీ అయిన‌ట్లే. వీటిని గ్రీన్ చట్నీతో కానీ, కెచప్ తో కానీ తింటే ఎంతో టేస్టీగా ఉంటాయి. సో ఇంకెందుకు ఆల‌స్యం.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: