కావాల్సిన ప‌దార్థాలు:
చికెన్- అరకిలో
పుదీనా- రెండు క‌ట్టులు
పెరుగు-  అరకప్పు

 

జీడిపప్పు- ప‌ది నుంచి ప‌దిహేను
గరం మసాలా- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర త‌రుగు- ఒక‌ కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌- అర టీ స్పూన్‌

 

పచ్చిమిర్చి- నాలుగు
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
అల్లం ముక్కు- చిన్న‌ది

 

వెల్లుల్లి- మూడు రెబ్బ‌లు
నిమ్మకాయ ర‌సం- ఒక టీ స్పూన్‌
పసుపు- అర టీ స్పూన్‌
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 

త‌యారీ విధానం: 
ముందుగా చికెన్‌ను నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్ వేసుకోవాలి. ఆ త‌ర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు,  గరంమసాలా మ‌రియు ముందుగా త‌యారు చేసుకున్న పుదీనా పేస్ట్ వేసి బాగా క‌లుపుకోవాలి.

 

చికెన్ ముక్క‌ల‌కు పుదీనా పేస్ట్ మ‌రియు ఇత‌ర మిశ్ర‌మాల‌న్నీ బాగా ప‌ట్టేలా క‌లుపుకుని.. ఒక గంటసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. అనంత‌రం ఫ్రిజ్‌లోని బౌల్‌ను బ‌య‌ట‌కు తీసుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేగాక జీడిపప్పులు వేసి వేయించుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.

 

ఇప్పుడు ఆ పాన్‌లో మ‌రికాస్త నూనె వేసి చికెన్ ముక్కలు వేయాలి. చికెన్ అన్నివైపులా చక్కగా ఉడికే వ‌ర‌కు బాగా ఫ్రై చేసుకోవాలి. త‌నంత‌రం స్టౌ ఆఫ్ చేసి జీడిప‌ప్పు, నిమ్మ‌రసం మ‌రియు కొత్తిమీర వేస్తే స‌రిపోతుంది. అంతే వేడి వేడి నోరూరించే పుదీనా చికెన్ రెడీ అయిన‌ట్లే. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. మ‌రి ఈ టేస్టీ రెసిపీని ఆల‌స్యం చేయ‌కుండా మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: