కొబ్బరి రైస్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగానే మనం ప్రతి సోమవారం, శుక్రవారం ఇంట్లో దేవుడికి పూజా చేసి టెంకాయి కొడుతాం. ఇంకా అలా కొట్టిన టెంకాయిలో ఉండే కొబ్బరితో కొబ్బరి రైస్ చేస్తే ఎంత రుచిగా అద్భుతంగా ఉంటుంది. మరి అలాంటి అద్భుతమైన వంటకాన్ని మీరు ఓసారి ప్రయత్నించండి. కొబ్బరి అన్నంను ఇష్టంగా తినండి. 

 

IHG

 

కొబ్బరి అన్నంకు కావాల్సిన పదార్ధాలు.. 

 

బియ్యం-1 కిలో

 

కొబ్బరి తురుము- 1 కప్పు

 

ఎండుమిర్చి-2

 

పచ్చి మిర్చి -4 (తరిగి పెట్టుకోవాలి)

 

కరివేపాకు-2 రెబ్బలు

 

తాలింపు గింజలు- 1 చెంచా (ఆవాలు, జీలకర్ర, మినపబడ్డలు, పచ్చి సెనగపప్పు)

 

నూనె- 1 కప్పు

 

పసుపు : చిటికెడు

 

ఉప్పు : తగినంత

 

కొబ్బరి అన్నం తయారీ విధానం.. 

 

IHG

 

అన్నం కాస్త పొడి పొడి వండి పక్కన పెట్టాలి. ఇంకా దానికి తగినంత ఉప్పు పళ్లెంలో పోసి ఆరనివ్వాలి. పొయ్యి మీద ఒకరకమైన మాన్తా పెట్టి ఒక పాన్ పెట్టాలి. ఇంకా అందులోకి కాస్త నూనె పోసి వేడి అయ్యాక తాలింపు గింజలు, మిర్చి, కొబ్బరి తురుము, పసుపు వేసి వేగిన తర్వాత కరివేపాకు చిటపటలాడించి చివర్లో అన్నంలో వేసి కలిపితే కొబ్బరి అన్నం సిద్దం. అంత అద్భుతమైన ఈ కొబ్బరి అన్నంను వెంటనే తినేయండి.                     

మరింత సమాచారం తెలుసుకోండి: