కావాల్సిన ప‌దార్థాలు:
మైదా- ఒక కప్పు
కొబ్బరి తురుము- ఒక కప్పు
బెల్లం తురుము- ఒకటిన్న‌ర‌ కప్పు

 

కొబ్బరి నూనె- ఒక టీస్పూన్‌ 
పసుపు- పావు టీ స్పూన్‌
యాలకుల పొడి- ఒక టీ స్పూన్‌

 

నెయ్యి- మూడు స్పూన్లు
ఉప్పు- చిటికెడు
నీళ్లు- ఒక కప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో మైదా, పసుపు, ఉప్పు కాస్త నీళ్లు వేసి పిండిలా కలపాలి. అందులో కొంచెం కొబ్బరి నూనె కూడా వేసి బాగా కలపాలి. బొబ్బట్లకు పిండిని కలుపుకుంటామో అలాగే కలుపుకుని ఓ పావు గంట‌ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.. అందులో నీళ్లు, బెల్లం తురుము వేసి కరిగించాలి. 

IHG

బెల్లం క‌రిగాక.. ఈ మిశ్రమాన్ని వడకట్టాలి. ఇప్పుడు ఆ బెల్లం మిశ్రమంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలపాలి. త‌ర్వాత‌ ఆ బెల్లం, కొబ్బరి మిశ్రమాన్ని మళ్లీ స్టవ్ మీద పెట్టాలి. తేమ పోయేంత వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. అనంత‌రం ఆ మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి. 

IHG

ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకుని ఉండలా చుట్టి చేత్తొనే పూరీ లా ఒత్తి మధ్యలో... కొబ్బరి మిశ్రమం పెట్టాలి. అంచుల్నీ మూసేసి.. మళ్లీ గుండ్రంగా ఒత్తేయాలి. 

IHG

ఆ త‌ర్వాత‌ పెనం మీద నెయ్యి వేసి బొబ్బట్టుని అటు ఇటు దోరగా కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కొబ్బరి బొబ్బట్లు రెడీ అయిన‌ట్లే. వీటిని వేడిగా లేదా చ‌ల్ల‌గా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కాబ‌ట్టి, ఈ కొబ్బరి బొబ్బట్లు రెసిపీని మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: