కార్న్ మసాలా.. మనం ఎప్పుడు రెస్టారెంట్ లోనే తింటుంటాం. ఎంతో టేస్ట్ గా ఉంటుంది. మళ్లీ మళ్లీ తినాలి అని అనిపించే రేంజ్ లో కార్న్ మసాలా ఉంటుంది. మరి అలాంటి కార్న్ మసాలా ఈ లాక్ డౌన్ లో ఇంట్లోనే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

లవంగాలు - ఎనిమిది, 

 

మిరియాలు - చెంచా, 

 

యాలకులు - ఆరు, 

 

ధనియాలు, జీలకర్ర - టేబుల్‌ స్పూను చొప్పున, 

 

దాల్చిన చెక్క - చిన్న ముక్క.

 

మొక్కజొన్న గింజలు - కప్పు, 

 

నూనె - టేబుల్‌స్పూను, 

 

జీలకర్ర, మినప్పప్పు, సెనగపప్పు - చెంచా చొప్పున, 

 

కరివేపాకు - రెండు రెబ్బలు, 

 

పచ్చిమిర్చి - రెండు, 

 

ఉల్లిపాయ - ఒకటి, 

 

వెల్లుల్లి రెబ్బలు - రెండు, 

 

అల్లం తరుగు - చెంచా, 

 

కొబ్బరి తురుము - అరకప్పు, 

 

పసుపు - అరచెంచా, 


కారం - చెంచా, 


ధనియాలపొడి - రెండు చెంచాలు, 

 

ఉప్పు - తగినంత, 

 

చింతపండురసం - మూడు చెంచాలు, 

 

బెల్లం తరుగు - చెంచా, 

 

గరంమసాలా - చెంచా, 

 

నిమ్మరసం - కొద్దిగా.

 

తయారీ విధానం... 

 

మసాలా కోసం తీసుకున్న అన్ని పదార్ధాలు కూడా నూనె లేకుండా వేయించి వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి. పాన్ ని పొయ్యి మీద పెట్టి నూనె వేసి అది వేడయ్యాక జీలకర్రా, మినప్పప్పూ, సెనగపప్పు వేయించాలి. రెండు నిముషాలు అయ్యాక కరివేపాకూ, పచ్చిమిర్చీ, ఉల్లిపాయ ముక్కలూ, అల్లం,వెల్లుల్లి తరుగు వేయాలి. ఉల్లిపాయలు వేగాక కొబ్బరితురుము కలిపి కొబ్బరి పచ్చివాసన పోయాక పసుపూ, కారం, ధనియాలపొడీ, ముందుగా తయారు చేసుకున్న మసాలా, తగినంత ఉప్పూ, కాసిని నీళ్లూ, చింతపండు రసం, బెల్లం తరుగూ, మొక్కజొన్న గింజలూ వేయాలి. అవి ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చెయ్యాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: