చికెన్ ఇష్టపడే వాళ్ల  లిస్ట్ లో ఉన్న ఒక పాపులర్ వంటకాలలో గోంగూర చికెన్ కూడా ఒకటి. దీనిని ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.అంత రుచిగా ఉంటుంది ఈ కూర.ఇదే కాకుండా గోంగూర మటన్, గోంగూర రొయ్యలు కూడా పాపులర్ వంటకాలే. ఒక పక్క గోంగూరలోని పులుపు మరోపక్క చికెన్ ముక్క కలిపి తింటే ఎంతటి వారయినా సరే వాహ్వా అనాలిసిందే. ఈ కూరకి తెల్ల గోంగూర అంత పులుపుగా ఉండదు కాబట్టి ఎర్ర గోంగూర ఉపయోగించి ఈ కూర వండితే రుచిగా ఉంటుంది. ఎలా ఒక్కసారి వండి రుచి  చుడండి... !

 

గోంగూర పేస్ట్ కోసం:

1) 150 గ్రాములు గోంగూర

2) 1 మీడియం ఉల్లిపాయాలు 

3) 4 పచ్చిమిరపకాయలు

4) ¼ కప్పు వేయించిన జీడిపప్పు

కూర కోసం:

1) 600 గ్రాములు చికెన్

2) 200 గ్రాములు ఉల్లిపాయ తరుగు

3) 2 పచ్చిమిరపకాయలు

4) 1 రెమ్మ కరివేపాకు

5) 2 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్

6) 1 tsp ఉప్పు

7) ½ tsp పసుపు

8) 2 tsp కారం

9) 1 tsp ధనియాల పొడి

10) ½ tsp గరం మసాలా

11) 1/3 కప్పు వేయించిన జీడిపప్పు

 

 

తయారీ విధానం :

ముందుగు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి  అందులో 2 tsp ల నునెని వేడి చేసి అందులో ¼ కప్పు జీడిపప్పు వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.అదే కడాయిలో 3 tsp ల నూనె వేడి చేసి అందులో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గోంగూర వేసి వేయించాలి.గోంగూర ఆకులు ముడుచుకుపోయి రంగు మారేవరకు వేయించి స్టౌ కట్టేయాలి.వాటిని కాసేపు ఆరనిచ్చి మిక్సీ లో గోంగూర,వేయించిన జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.తర్వాత ఒక బాణలిలో 5 నుండి 6 tbsp ల నూనె వేడి చేయాలి.అందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు ఉడికించాలి.తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. చికెన్ కూడా వేసి, ఒకసారి బాగా కలిపి, మీడియం హీట్ మీద 5 నుండి 7 నిమిషాలు పాటు మూత పెట్టి ఉడికించాలి.కూరలో తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.మూత పెట్టి 3 వంతులు ఉడికేవరకు ఉడికించాలి.మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి.చికెన్ 3 వంతులు ఉడికిన తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న  గోంగూర పేస్ట్, గరం మసాలా వేసి కలపాలి.మూత పెట్టి సన్నని సెగ మీద 5 నుండి 7 నిమిషాలు ఉడికించి స్టౌ కట్టేయాలి.

 

 

మసాలాలు ఎక్కువ తిననివారు  ఈ కూరలో గరం మసాలా వేయకుండా ఉల్లిపాయల్ని వేయించేటపుడు 4 లవంగాలు, 2 యాలుకలు, 1 అంగుళం దాల్చినచెక్క వేస్తే సరిపోతుంది.రోజు విడిచి రోజు మాంసాహారం తినే అలవాటు ఉన్నవారు కూరలు ఇలానే చేస్తారు.ఎందుకంటే మసాలాలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా.అదే కూరలో గరం మసాలా దినుసులని నేరుగా వేస్తే, వాటి సువాసన కూరకు పడుతుంది.తర్వాత వాటిని ఏరి పారేయవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: