కావాల్సిన ప‌దార్థాలు:
బోన్ లెస్ చికెన్- పావుకిలో
మిరప కాయలు- ఎనిమిది
నూనె- తగినంత

 

పసుపు- చిటికెడు
కారం- ఒక టీస్పూన్‌
మైదా- ఒక‌ కప్పు

 

ఉల్లిపాయ ముక్క‌లు- అర క‌ప్పు
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తి మీర తరుగు- అర క‌ప్పు

 

గ‌రం మ‌సాలా- అర టీ స్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- అర టీ స్పూన్‌
క‌రివేపాకు- రెండు రెబ్బ‌లు

 

త‌యారీ విధానం: 
ముందుగా చికెన్ ను శుభ్రప‌రిచి ఖీమాలా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కుక్కర్ పెట్టి కాస్త నూనె వేసి ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు కాస్త వేగాక పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి. ఐదు నిమిషాల త‌ర్వాత చికెన్ కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అందులో తురిమిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించాలి. 

 

బాగా వేగాక కొద్దిగా నీరుపోయాలి. అనంత‌రం కుక్కర్ పై మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు మైదాని ఒక గిన్నెలో వేసుకుని అర టీస్పూను ఉప్పు వేయాలి. కాస్త నీళ్లు వేసి బాగా కలిపి పూరీ ఉండలు చుట్టుకోవాలి. పూరీలకు చుట్టుకునేట్టు పెద్దవి కాకుండా... కాస్త చిన్నవి చుట్టుకోవాలి. 

 

ఇప్పుడు వాటిని పూరీల్లా ఒత్తుకోవాలి. మ‌రోవైపు బజ్జీ మిర్చీలకు మధ్యలో గాటు పెట్టి గింజ‌లు తీసేసి.. చికెన్ మిశ్రమాన్ని కూరాలి. ఆ మిర్చి చుట్టు ఒత్తుకున్న పూరీని చుట్టేసి చివర్లు నొక్కేయాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద పాన్ పెట్టి నూనె పోసి.. కాగ‌నివ్వాలి. 

 

కాగిన నూనెలో సిద్ధం చేసుకున్న బ‌జ్జీలను వేసి వేయించుకుంటే స‌రిపోతుంది. అంతే నోరూరించే చికెన్ మిర్చీ బజ్జీ రెడీ అయిన‌ట్లే. సాయంత్రం వేళ‌లో వీటిని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ చికెన్‌తో మిర్చి బజ్జీ రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: