కావాల్సిన ప‌దార్థాలు: 
క్యారెట్ - నాలుగు
పంచదార పొడి - ఒక కప్పు
గుడ్లు - మూడు

 

బేకింగ్ పౌడర్ - ఒక టీస్పూన్‌
మైదా - ఒక కప్పు
బేకింగ్ సోడా - అర టీస్పూన్‌

 

యాలకులు - మూడు
దాల్చిన చెక్క పొడి - చిటికెడు
నూనె - సరిపడినంత

 

ఉప్పు - అరటీస్పూన్‌
జీడిపప్పు - పది నుంచి ప‌దిహేను
బాదం ప‌ప్పు- ప‌ది

 

త‌యారీ విధానం:
ముందుగా క్యారెట్ల‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగిపెట్టుకోవాలి. అనంత‌రం వాటికి తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో గుడ్లను పగుల గొట్టి బాగా గిలక్కొట్టాలి. ఆ త‌ర్వాత ఇందులో మైదా, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.

IHG's Bigger Bolder ...

ఇప్పుడు జీడిపప్పు మ‌రియు బాదం ప‌ప్పును చిన్నగా తురుముకుని వాటిని కూడా వేయాలి. చివర్లో క్యారెట్ తురుము కూడా వేసి బాగా క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత ఓవెన్ 180 డిగ్రీలకు ప్రీ హీట్ చేసి పెట్టాలి. కేక్ ట్రే అడుగుభాగాన కాస్త వెన్న రాసి మైదా చల్లాలి. అందులో క్యారెట్ తరుము మిశ్రమాన్ని వేయాలి. 

IHG

ఆ ట్రేను ఓవెన్ అరగంట పాటూ ఉంచాలి. అనంతరం బయటకు తీసి చల్లారేవరకు వదిలేయాలి. చల్లారాక ఆ క్యారెట్ కేకును ముక్కలుగా కోసి సర్వ్ చేస్తే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ క్యారెట్ కేక్ రెడీ అయిన‌ట్లే. సాయంత్రం వేళ‌లో ఈ కేక్‌ను తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ క్యారెట్ కేక్‌ను మీరు కూడా త‌ప్ప‌కుండా త‌యారు చేసుకుని.. ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: