సపోటా జ్యూస్.. మనకు చాలా అరుదుగా దొరుకుతుంది. కానీ ఈ జ్యూస్ తాగితే ఎన్నో పోషకాలు మన సొంతం అవుతాయి. ఎన్నో లాభాలు ఇచ్చే ఈ సపోటా జ్యూస్ మనకు ఐరన్ సమస్య లేకుండా చేస్తుంది. మరి అలాంటి సపోటా జ్యూస్ ఎలా తయారు చెయ్యాలి? ఎలా చేస్తే రుచిగా ఉంటుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

సపోటా జ్యుస్ కి కావాల్సిన పదార్ధాలు.. 

 

సపోటా- 6, 

 

పెరుగు - అర కప్పు, 

 

చక్కెర- 3 చెంచాలు, 

 

ఉప్పు - చిటికెడు, 

 

ఎండు ఖర్జూరాలు - 10

 

తయారీ విధానం.. 

 

ముందుగా ఎండు ఖర్జూరాలు ఒలిచి గింజలు తీసి ముక్కలుగా చెయ్యాలి. తర్వాత సపోటా తొక్క, గింజలు తీసి గుజ్జు తీసుకోవాలి. ఇంకా ఇప్పుడు వీటిని మిగిలిన పదార్థాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి వడగట్టాలి. అంతే సపోటా జ్యూస్ రెడీ. 

 

సపోటాలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. వృద్ధాప్యంలో కూడా క౦టి చూపును మెరుగుపరచడానికి సపోటా ఎంతో సహాయపడుతుంది. అందువల్ల మంచి దృష్టి ఉండాలంటే సపోటా పండును తినాలి.

 

సపోటా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. క్రీడాకారులకు ఎంతో శక్తి అవసరం అందువల్ల, వారిని సపోటా పండు తినమని చెప్తుంటారు. 

 

సపోటాలో విటమిన్ ఏ, విటమిన్ బి ఎక్కువ ఉండడం వల్ల చర్మం ఆరోగ్య నిర్మాణ నిర్వహణకు సహాయపడుతుంది. సపోటాలోని యాంటీ-ఆక్సిడెంట్లు, పీచు, పోషకాలు కాన్సర్ ను౦చి రక్షణ ఇస్తాయి. విటమిన్ A ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్ నుండి రక్షణని అందిస్తుంది.

 

పిండిపదార్ధాలు, అవసరమైన పోషకాలు సపోటాలో ఎక్కువ ఉంటాయి.. ఇవి గర్భవతులకు ఎంతో సహాయపడుతాయి. 

 

ఇంకా తరచూ ఈ సపోటా రసం తాగితే ఇందులో ఐరన్‌, క్యాల్షియం మూలంగా రక్త హీనత తొలిగిపోయి ఎముకలు గట్టిపడి బలంగా తయారవుతారు. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ జ్యూస్ తాగండి ఆరోగ్యంగా తయారవ్వండి. 

 

ఇంకా తరచూ ఈ రసం తాగితే ఇందులో ఐరన్‌, క్యాల్షియం మూలంగా రక్త హీనత తొలిగిపోయి ఎముకలు గట్టిపడి బలంగా తయారవుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ జ్యూస్ తాగండి ఆరోగ్యంగా తయారవ్వండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: