కావాల్సిన ప‌దార్థాలు:
ఖీమా- అర‌ కిలో
బాస్మతి బియ్యం- మూడు కప్పులు
ఉల్లిపాయ‌ ముక్కలు- అరకప్పు
పచ్చి మిర్చి- మూడు

 

జీలకర్ర- ఒక టీస్పూన్‌
మసాలా దినుసులు- అన్నీ క‌లిపి ఒక క‌ప్పు
వెల్లుల్లి తురుము- రెండు టీస్పూన్లు

 

కారం- ఒక టీస్పూన్‌
గరం మసాలా- ఒక టీస్పూన్‌
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు టీస్పూన్లు
టొమాటో ముక్కలు- ఒక కప్పు

 

పుదీనా తురుము- అర క‌ప్పు
ఉప్పు- రుచికి సరిపడా
కొత్తిమీర తురుము- అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా బాస్మతి బియ్యాన్ని నీళ్లలో అరగంటసేపు నాన‌బెట్టుకోవాలి. అలాగే మ‌రోవైపు ఖీమాను శుభ్రంగా క‌డిగి పెట్టుకోవాలి. ఇప్పు స్ట‌వ్ ఆన్ చేసి గెన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వెయ్యాలి. నూనె వేడి అయ్యాక మసాలా దినుసులన్నీ వేసి వేయించాలి. మ‌సాలా దినుసుల‌న్నీ వేగాక జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, వెల్లుల్లి తురుము వేసి వేయించాలి. 

 

అవి వేగాక ఇప్పుడు అందులో కడిగి పెట్టుకున్న కీమాను కూడా వేసి ఐదు నిమిషాలు మ‌గ్గ‌నివ్వాలి. అనంత‌రం అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, టోమాటో ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ముఖ్యంగా కీమా 90 శాతం ఉడికిపోవాలి. అలా ఉడికిన తరువాత నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేయాలి. ఇప్పుడు అందులో నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. 

 

బియ్యం వేసాక‌.. కాస్త గరంమసాలా కూడా చేర్చి ఉడికించాలి. మంట సిమ్ లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇక చివ‌రిగా దించే ముందు పుదీనా, కొత్తిమీర వేస్తే స‌రిపోతుంది. అంతే నోరూరించే ఖీమా బిర్యానీ రెడీ అయిన‌ట్లే. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ ఖీమా బిర్యానీ మీరు కూడా త‌ప్ప‌కుండా ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: