కావాల్సిన ప‌దార్థాలు:
మైదా పిండి - రెండు కప్పులు
గోధుమపిండి - ఒక కప్పు

 

మిరియాల పొడి - ఒక టీస్పూను
ఉడకబెట్టిన గుడ్లు - ఆరు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్‌
జీల‌క‌ర్ర - అర టీ స్పూన్‌

 

నూనె - తగినంత
కారం - ఒక టీ స్పూన్‌
ఉప్పు - సరిపడా
కొత్తిమీర త‌రుగు - అర క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, గోధుమపిండి నూనె వేసి కలపాలి. తరువాత నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి ముద్దలా కలిపాలి. ఆ పిండి ముద్దను తడిబట్టలో పెట్టి అరగంటసేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు గుడ్లు ఉడికించి పెంకు తీసేసి, చిన్న చిన్న ముక్కలుగా తురమాలి. అనంతరం స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. అందులో జీల‌క‌ర్ర వేసి వేయించాలి.

 

జీల‌క‌ర్ర వేగాక‌.. అందులో తురుముకున్న కోడిగుడ్ల తురుము, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి వేసి కాసేప వేగ‌నివ్వాలి. ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు వేగ‌నిచ్చి కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ముందుగా క‌లుపుకున్న పిండి మిశ్‌ర‌మాన్ని ఉండ‌లు చేసుకుని.. చపాతీలా వత్తి, పెనం మీద రెండు వైపులా కాల్చి పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత‌ ఒక్కో చపాతీని సగానికి కోయాలి. 

 

చపాతీ ముక్కల్ని తడిబట్టలో చాపలా చుట్టాలి. తడిబట్టలా నిమిషం పాటు ఉంచాక తీసేయాలి. ఇప్పుడు ఒక్క ముక్కని త్రికోణాకారంలో సమోసాలా చుట్టి అందులో గుడ్డు మిశ్రమాన్ని వేసి మడిచేయాలి. ఆ త‌ర్వాత వాటిని కాగిన నూనెలో వేయించి తీస్తే... ఎగ్ సమోసాలు రెడీ అయిన‌ట్లే. సాయంత్రం వేళ‌లో వేడి వేడిగా వీటిని తింటే అదిరిపోతుంది. సో.. ఈ రుచిక‌ర‌మైన ఎగ్ సమోసా రెసిపీని మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: