కావాల్సిన ప‌దార్థాలు:
శనగపిండి - ఒక‌ కప్పు
మైదా - ఒక‌ కప్పులు
పాలు - రెండు టేబుల్ స్పూన్స్
యాలకులు పొడి - అర‌ టేబుల్ స్పూన్

 

గుమ్మడి గింజలు - ఒక టేబుల్ స్పూన్
కర్బూజ గింజలు - ఒక‌ టేబుల్ స్పూన్
పిస్తా ప‌ప్పు - ప‌ది నుంచి ప‌డిహేను

 

బాదం - ప‌ది నుంచి ప‌డిహేను
పంచదార - రెండు కప్పులు
నెయ్యి - పావు కేజి
నీళ్లు - ఒక‌ కప్పు 

 

త‌యారీ విధానం: ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసుకుని అందులో శనగపిండి, మైదాపిండి వేసి తక్కువ మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. మ‌రోవైపు పంచదార పాకం తయారు చేసుకోవాలి.

IHG

ఇందుకు స్ట‌వ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక‌ కప్పు నీళ్ళు, పాలు, పంచదార వేసి తక్కువ మంటమీద ఉడ‌క‌నివ్వాలి. పంచదార పాకం చిక్కబడేంత వరకూ కలుపుతూ సిరప్ ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పిండిని పోసి గరిటతో బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేస్తుంటే ఈ మిశ్రమం పోగుపోగులుగా ఏర్పడుతూ గట్టిపడుతుంది. 

IHG

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మందంగా ఉన్న గిన్నెలోకి పోసి ఆ వేడి మీదనే యాలకుల పొడి, బాదం, పిస్తాప‌ప్పు, గుమ్మడి, కర్బూజ గింజలను గార్నిష్ చేసుకుని ప‌క్క‌న పెట్టాలి. చల్లబడిన తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే సోన్ పాపిడి రెడీ అయినట్లే. వీటి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ సోన్ పాపిడి చేసుకుని ఎంజాయ్ చేయండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: