కావాల్సిన ప‌దార్థాలు:
మీల్ మేకర్ - రెండు కప్పులు
పసుపు - అర టీస్పూన్‌
జీలకర్రపొడి - అర టీస్పూన్‌
ధనియాల పొడి - ఒక టీస్పూన్

 

ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - ఒక టీస్పూన్‌
కారం - ఒక టీస్పూన్‌

 

ఉప్పు - రుచికి స‌రిప‌డా
బంగాళాదుంప ముక్క‌లు - అర‌ క‌ప్పు‌
గరం మసాలా - అర టీస్పూన్‌
బిర్యాని ఆకు - రెండు

 

జీలకర్ర - ఒక టీస్పూను
టొమాటో పేస్ట్ - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - సరిపడినంత
కొత్తిమీర - ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: 
ముందుగా..మీల్ మేకర్‌ను వేడి నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం చల్లనినీళ్లలో వేసి, పిండేసి నీళ్లు లేకుండా చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీలో వేసి అర నిమిషంపాటూ తిప్పాలి. పేస్టులా కాకుండా.. తరుగులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి... కాస్త నూనె వేయాలి. 

 

అందులో జీలకర్ర, బిర్యాని ఆకులు వేసి వేయించాలి. ఇవి వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేయించాలి. అందులో కాస్త పసుపు, కారం కూడా వేసి కలుపుకోవాలి. అనంత‌రం జీలకర్రపొడి, ధనియాల పొడి, గరంమసాలా కూడా వేసి బాగా వేయించాలి. కాసేపయ్యాక టొమాటో పేస్ట్‌, త‌గినంత ఉప్పు వేసి కలపాలి. 

 

అవి బాగా వేగాక... ఉడికించి క‌ట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, మిక్సీ ప‌ట్టుకున్న మిల్ మేక‌ర్ మిశ్ర‌మాన్ని వేసి బాగా కలపాలి. అన్నీ కలిసి బాగా ఉడికే వరకు ఉంచాలి. అవసరమైదే నీళ్లు వేసుకోవచ్చు. లేదా చిన్న మంటమీద నీళ్లు లేకుండా ఉడికంచుకోవచ్చు. ఇలా బాగా ఉడికాక‌.. చివ‌రిలో కొత్తిమీర జ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే మీల్ మేకర్‌ ఖీమా కర్రీ రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. సో.. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: