కావాల్సిన ప‌దార్థాలు:
బంగాళాదుంపలు - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్ స్పూన్‌
బ్రెడ్ పొడి - అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర‌ కప్పు

 

మైదా పిండి - రెండు టీస్పూన్లు
ఉప్పు - రుచికి త‌గినంతా
నూనె - సరిపడినంత
కారం - అర టీ స్పూన్‌

 

ధనియాల పొడి - ఒక టీస్పూన్‌
నిమ్మరసం - ఒక టీస్పూన్‌ 
ఐస్ క్రీం పుల్లలు - ఎనిమిది
కొత్తి మీర తరుగు - అర క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను శుభ్రంగా క‌డిగి.. ఉడికించుకోవాలి. అనంత‌రం వాటిని తురుములా చేసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో బంగాళాదుంపల తురుము, ఉల్లిపాయ ముక్క‌లు, బ్రెడ్ పొడిలో సగం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. మ‌రియు అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం, ధనియాల పొడి, నిమ్మరసం, ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి.

IHG

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత‌ ఒక గిన్నెలో మైదా, కొద్దిగా నీళ్లు వేసి పిండిలా కలుపుకోవాలి. అనంత‌రం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రై చేసేందుకు సరిపడా నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కాక ఒక ఐస్ క్రీం పుల్ల చివర బంగాళాదుంప ముద్దను గుచ్చుకోవాలి.

IHG

 ఆ లాలీపాప్ ను మైదా మిశ్రమంలో ముంచి, తరువాత బ్రెడ్ పొడిలో అద్దాలి. అన్నింటినీ ఇలాగే చేసుకుని తరువాత నూనెలో వేయించాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించుకుని తీసుకుంటే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన ఆలూ లాలీపాప్స్ రెడీ. సాయంత్రం వేల‌లో వీటిని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ ఆలూ లాలీపాప్స్ మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: