కావాల్సిన ప‌దార్థాలు:
బాస్మతి బియ్యం - ఒక కప్పు
చింతచిగురు - అరకప్పు
వెల్లుల్లి రెబ్బలు - ఐదు

 

మసాలా దినుసులు - సరిపడినన్నీ
పచ్చిమిర్చి - అయిదు
సోంపు - ఒక టీస్పూన్‌

 

నూనె - ఒక టీస్పూన్‌
ఉల్లిపాయ ముక్క‌లు - అరకప్పు
అల్లం - చిన్న ముక్క

 

ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
కొత్తిమీర త‌రుగు - అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా చింత చిగురుని నీటిలో శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. మరియు బియ్యాన్ని కూడా కడిగి నీరు వార్చాక, మూడు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు  స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. కాస్త నూనె పోసి ముందుగా ఆర‌పెట్టుకున్న చింత చిగురు వేయించాలి. ఇప్పుడు కాస్త నీళ్లు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. అనంత‌రం పచ్చి మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి ముక్కలు, సోంపు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేయాలి.

IHG

ఆ త‌ర్వాత‌ స్టవ్ మీద పాన్‌ పెట్టి నూనె వేసి అది వేడెక్కాక మసాలా దినుసులు, ఉల్లితరుగు వేయించాలి. అవి వేగాక చింతచిగురు వేసి వేయించాలి. రెండు నిమిషాల పాటూ వేయించాక నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి. తరువాత రెండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పువేసి కలపాలి. 

IHG

ఇప్పుడు మూత పెట్టి అన్నం ఉడికే వరకు ఉంచాలి. రైస్ బాగా ఉడికాక‌.. లాస్ట్‌లో కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అంతే చింతచిగురు బిర్యానీ రెడీ అయిన‌ట్లే. దీనిలో చికెన్ కర్రీ వేసుకుని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ చింతచిగురు బిర్యానీని ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: