కావాల్సిన ప‌దార్థాలు
కరివేపాకు - ఒక కప్పు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
ఉల్లిపాయ‌ ముక్కలు - ఒక కప్పు

 

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్‌
పచ్చిమిర్చి - రెండు
కొబ్బరి తురుము - అర‌ కప్పు

 

ఉప్పు - రుచికి స‌రిప‌డా
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - రెండు‌ టీ స్పూన్‌

 

షాజీరా - ఒక టీస్పూన్‌
లవంగాలు - మూడు
గ‌రం మ‌సాలా - అర టీ స్పూన్‌

 

త‌యారీ విధానం: ముందుగా క‌రివేపాకు శుభ్రం చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌రియు బాస్మతి బియ్యాన్ని కూడా కడిగి నీరు వార్చేసి పక్కన వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి ఒక టీస్పూను నూనె వేయాలి. నూనె వేగాక‌ అందులో కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ త‌ర్వాత అదే పాన్‌లో కొబ్బరి తురుము కూడా వేసి వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.

 

అనంత‌రం స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి.. అందులో కొద్దిగా నూనె వేసి లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు, షాజీరా, పచ్చి మిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, గ‌ర‌స మ‌సాలా వేసి వేయించాలి. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి వేయించాలి. అనంతరం కరివేపాకు పేస్ట్‌ వేసి బాగా కలపాలి. 

 

ఇప్పుడు స‌రిప‌డా ఉప్పు, నిమ్మరసం కూడా వేసి బాగా మిక్స్ చేసి.. ఒక‌టిన్న‌ర క‌ప్పు నీరు పోసి మూత పెట్టేయాలి. అన్నం పలుగ్గా అయ్యాక చిన్న మంట మీద మగ్గనివ్వాలి. పదినిమిషాల తరువాత స్టవ్ కట్టేస్తే స‌రిపోతుంది. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కరివేపాకు రైస్ రెడీ. లంచ్ టైమ్‌లో దీన్ని తీసుకుంటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ  కరివేపాకు రైస్‌ను త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: