కావాల్సిన ప‌దార్థాలు:
అటుకులు - ఒక కప్పు
బెల్లం తురుము - ఒక‌కప్పు
జీడిపప్పు - ప‌ది నుంచి ప‌దిహేను

 

యాలకుల పొడి - అర టీ స్పూను
నెయ్యి - మూడు టీ స్పూనులు
బాదంప‌ప్పు - ప‌ది నుంచి ప‌దిహేను

 

కొబ్బరి తురుము - మూడు టీ స్పూన్లు
పాలు - రెండు కప్పులు
పంచ‌దార - రెండు టేబుల్ స్పూన్లు

 

త‌యారీ విధానం: 
ముందుగా అటుకులను ఒక ఐదు నిమిషాల పాటు మంచి నీళ్లలో నానబెట్టుకోవాలి. అనంత‌రం అటుకుల్లో నీరు  లేకుండా పిండేసి.. పక్కన పెట్టాలి. . ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి జీడి పప్పు మ‌రియు బాదంప‌ప్పు వేయించి ప‌క్క‌న పెట్టుకోవాలి.

IHG

ఆ తరువాత కొబ్బరి తురుము వేసి వేయించాలి. వేగాక పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడే బెల్లం తురుము, పంచ‌దార‌ వేసి ఉడికించాలి. బెల్లం, పంచ‌దార‌ బాగా కరిగిపోయేలా చూడాలి. బెల్లం, పంచ‌దార‌ పూర్తిగా కరిగాక అటుకుల్ని వేసి బాగా కలిపి, ఉడికించాలి. 

IHG

చివరగా యాలకుల పొడి, ముందుగా వేయించుకున్న జీడిప‌ప్పు, బాదంప‌ప్పు వేయాలి. రెండు నిమిషం తరువాత స్టవ్ ఆఫ్‌ చేస్తే స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ అటుకుల పాయసం రెడీ. సాయంత్రం వేల దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, ఈ టేస్టీ అటుకుల పాయసం త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: