కావాల్సిన ప‌దార్థాలు:
చేపలు - అరకిలో
పచ్చి మిర్చి - ఐదు
కరివేపాకు - నాలుగు రెబ్బలు

 

పసుపు - అరటీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్‌
నూనె - ఐదు టేబుల్ స్పూన్లు

 

ఉప్పు - రుచికి స‌రిప‌డా
ఉల్లిపాయ త‌రుగు - ఒక కప్పు
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

 

ఆవాలు - అరటీ స్పూన్‌
కొత్తిమీర త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం:
ముందుగా చేప‌ల‌ను నీటిలో బాగా శుభ్రం చేసి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. అనంత‌రం చేసముక్కల్ని రెండు నిమిషాల పాటూ ఉడికస్తే కాస్త మెత్తగా తయారవుతాయి. అప్పుడు వాటిలోని ముళ్లని తీసేసి చేత్తొనే పొడిపొడిగా తురుములా చేసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్‌ పెట్టి నూనె వేయాలి. 

IHG's Kitchen

నూనె వేడెక్కాక అందులో ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్క‌లు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత‌ అందులో పసుపు కూడా వేసి వేయించాలి. బాగా వేగాక ముందుగా తురుముకున్న చేప ముక్కలు అందులో వేసి బాగా కలపాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసి మళ్లీ బాగా కలపాలి. 

IHG

ఒక ప‌ది నిమిషాల త‌ర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే రుచిక‌ర‌మైన‌, సులువైన చేపల కీమా రెడీ అయిన‌ట్లే. రైస్ లేదా చ‌పాతీతో తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ చేపల కీమా రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: