కావాల్సిన ప‌దార్థాలు:
మటన్ - ఒక కిలో
టమోటో ముక్క‌లు - అరకప్పు
కారం - ఒకటిన్న‌ర‌ టీస్పూన్‌
మిరియాల పొడి - రెండు టీ స్పూన్లు‌

 

సోంపు - అర టీస్పూన్‌
దాల్చిన చెక్క - ఒక‌టి
ల‌వంగాలు - రెండు

 

నూనె - ఐదు టేబుల్ స్పూన్లు
యాలకులు - రెండు
ఉప్పు - రుచికి స‌రిప‌డా
కరివేపాకు - రెండు రెమ్మలు

 

పసుపు - అర టీస్పూన్‌
గసగసాలు - అర టీస్పూన్‌
ధనియాల పొడి - అర టీస్పూన్‌

 

జీలకర్ర - ఒక టీస్పూన్‌
ఉల్లిపాయ ముక్క‌లు - ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కొత్తిమీర - ఒక క‌ట్ట‌

 

త‌యారీ విధానం: 
ముందుగా నీటిలో మటన్‌ను బాగా కడిగి పెట్టుకోవాలి. అనంత‌రం మ‌ట‌న్‌ను ప్రెషర్ కుక్కర్‌లో వేసి, నీళ్లు మ‌రియు పసుపు వేసి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి సోంపు, జీలకర్ర, యాలకులు, గసగసాలు, లవంగాలు, వేయించాలి. వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. 

 

ఇప్పుడు అదే పాన్‌లో మ‌రికొద్దిగా నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన‌ మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి. బాగా వేయిస్తే నూనె పైకి తేలుతుంది. 

 

అలా ఉడికాక‌ టమోటో ముక్కలు, కారం, ముందుగా పొడి చేసిన మసాలా, ఉప్పు వేసి క‌లిపి.. కాసేపు వేగనివ్వాలి. అనంతరం మిరియాల పొడి మటన్‌ ముక్కలపై చల్లి బాగా కలిపి... మ‌రి కాసేపు వేగనివ్వాలి. అనంత‌రం కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే మటన్ పెప్పర్ ఫ్రై రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాంట్టి, మీరు కూడా ఈ టేస్టీ మటన్ పెప్పర్ ఫ్రై రెసిపీ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: