కావాల్సిన ప‌దార్థాలు: 
క్యాలీఫ్లవర్ ముక్క‌లు - ఒక‌టిన్న‌ర‌ కప్పు 
నూనె - నాలుగు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్‌

 

ఆవాలు - అర‌ టీస్పూను
జీలకర్ర - అర టీస్పూను 
గుడ్లు - రెండు

 

కరివేపాకు - రెండు రెమ్మలు
కారం - ఒక‌టిన్న‌ర‌ టీస్పూనులు
ఉప్పు - రుచికి తగినంత

 

పసుపు - చిటికెడు
మినపప్పు - అర టీస్పూను 
కొత్తిమీర త‌రుగు - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: ముందుగా కాలీఫ్లవర్ ను శుభ్రం చేసుకుని‌ సన్నగా తురుమి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక‌..  మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేపాలి. పోపులు వేగాక‌.. ఇందులో క్యాలీఫ్లవర్ తురుము, పసుపు, కారం వేసి కాసేపు మ‌గ్గించాలి. 

 

అనంత‌రం రెండు గుడ్ల‌‌ను ప‌గ‌లు కొట్టి వేసి.. బాగా క‌లిపాలి. ఆ త‌ర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, స‌రిప‌డా ఉప్పు మ‌రియు కొద్దిగా నీరు పోసి వేడించాలి. నూనె పైకి తేలే వ‌ర‌కు వేగించి.. లాస్ట్‌లో కొత్తిమీర వేసి స్ట‌వ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెడీ అయిన‌ట్లే. 

 

రైస్ లేదా రోటితో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ కాలీఫ్లవర్ ఎగ్ ఫ్రై రెసిపీని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. కాలీఫ్లవర్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాలీఫ్లవర్ లో పీచుతోపాటు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. 

 

కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గిస్తుంది. అంతేకాదు ఈ రెండూ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచేలా చేయడంలో సహాయపడతాయి. ఊబకాయం, మధుమేహం, హృద్రోగాల బారిన పడకుండా రక్షించడంలో క్యాలీఫ్లవర్ తోడ్పడుతుంది. ఇక ఎగ్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక ఈ రెండిటి కాంబినేష‌న్‌లో రెసిపీని తీసుకుంటే ఇంకా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: