కావాల్సిన ప‌దార్థాలు:
చేప ముక్కలు - అర‌ కిలో
వెన్న - నాలుగు టీ స్పూనులు
బేకింగ్ పౌడర్ - అర‌ టీస్పూన్‌
మైదా - రెండు టీస్పూన్లు

 

ఉప్పు - రుచికి సరిపడా
కారం - ఒక టీ స్పూన్‌
కార్న్ ఫ్లోర్ - రెండు టీస్పూన్లు

 

ప‌సుపు - అర టీ స్పూన్‌
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్‌
వెల్లుల్లి తురుము - ఒక టీ స్పూన్‌
కొతిమీర తురుము - పావు క‌ప్పు

 

త‌యారీ విధానం:  
ముందుగా చేప ముక్కలు నీటిలో బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, మైదా, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, వెల్లుల్లి తురుము, ప‌సుపు వేసి కలపాలి. దానిలో కాస్త నీళ్లుపోసి జారు అయ్యేలా క‌లుపుకోవాలి.

IHG

ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న‌ చేపముక్కల్ని ఈ మిశ్రమంలో ముంచి అరగంట పాటూ పక్కన పెట్టుకోవాలి. అనంత‌రం స్ట‌వ్ ఆన్ పాన్ పెట్టుకోవాలి. ఆ త‌ర్వాత‌ పాన్లో వెన్న వేసి, అది వేడెక్కాక అందులో చేపముక్కలు వేయాలి. 

IHG

ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకూ వేయించాలి. అలా వేగిన త‌ర్వాత‌.. వాటిని ఒక ప్లేటు లోకి తీసుకుని, కొత్తిమీర చల్లి సర్వ్ చేస్తే స‌రిపోతుంది. కావాల‌నుకునే వారు నిమ్మ‌ర‌సం కూడా పిండుకోవ‌చ్చు. అంతే ఎంతో రుచిక‌ర‌మైన, సులువైన బటర్ ఫిష్ ఫ్రై రెడీ. రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ బటర్ ఫిష్ ఫ్రైని త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: