కావాల్సిన ప‌దార్థాలు: 
బాస్మతి బియ్యం - పావుకిలో
కీమా - పావుకిలో
లవంగాలు - ఐదు
మిరియాలు - అర‌ టీస్పూన్‌

 

జీలకర్ర - ఒక టీస్పూన్‌
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
ఉప్పు - రుచికి స‌రిప‌డా
ఉల్లి పాయ ముక్క‌లు - ఒక క‌ప్పు

 

దాల్చిన చెక్క - చిన్న ముక్క‌
యాలకులు - నాలుగు
గరం మసాలా - ఒక టీస్పూన్
పచ్చిమిర్చి - మూడు

 

అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక  టీస్పూన్‌
కారం - ఒక టీస్పూన్‌
టోమాటో ముక్క‌లు - ఒక క‌ప్పు
కొత్తిమీర తు‌రుము - ఒక క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా కీమాను శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి. మ‌రియు బ్యాస్మ‌తి బియ్యాన్ని కూడా క‌డిగి.. పావు నుంచి అర‌గంట పాలు నీటిలో నాన‌బెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కాక జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, వెల్లుల్లి ముక్క‌లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.

 

ఇవి బాగా వేగాక‌.. ఇందులో కీమా వేసి వేయించాలి. ప‌ది నిమిషాల పాటు కీమాను వేగ‌నిచ్చి.. ఆ త‌ర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టొమాటో ముక్కలు, కారం, వేసి వేయించాలి. అవి బాగా వేగాక మూడున్నర కప్పులు వేడి నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో తగినంత ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. 

 

అనంత‌రం నానబెట్టిన బియ్యాన్ని నీళ్లు వంపేసి కీమా మిశ్ర‌మంలో వేయాలి. బియ్యం సగం ఉడికాక స్టవ్ ని సిమ్లో పెట్టి ఉడికించాలి. పావుగంటలో బిర్యానీ ఉడికిపోతుంది. అలా ఉడికిపోయాక‌.. చివ‌రిలో కొత్తిమీర చల్లితే టేస్టీ టేస్టీ ఖీమా పలావ్ రెడీ. వేడి వేడిగా దీన్ని తింటే అదిరిపోతుంది. కాబ‌ట్టి, మీరు కూడా ఈ టేస్టీ ఖీమా పలావ్ త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: