కావాల్సిన ప‌దార్థాలు:
గోధుమ పిండి - ఒక క‌ప్పు
మైదా పిండి - మూడు టీ స్పూన్లు
పచ్చిమర్చి - నాలుగు

 

మిరియాల పొడి - ఒక టీస్పూన్‌
క్యాప్సికమ్ ముక్క‌లు - ఒక క‌ప్పు
టమోటా కెచప్ - ఒక టీ స్పూన్‌

 

ఉల్లిపాయ ముక్క‌లు - ఒక క‌ప్పు
జీలకర్ర పొడి - ఒక టీస్పూన్‌
నూనె - తగినంత 

 

పసుపు - అర టీ స్పూన్‌
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తురుము - అర క‌ప్పు

 

త‌యారీ విధానం: 
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసి క‌లిపాలి. అనంత‌రం స‌రిప‌డా నీరు పోసి ముద్దలా క‌లుపుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. నూనె వేయాలి. నూనె వేడెక్కాక పచ్చిమిర్చి ముక్క‌లు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపాలి. 

 

అవి వేగాక క్యాప్సికమ్, టమోటా ముక్క‌లును కూడా వేసి వేయించాలి. ముక్క‌లు బాగా మ‌గ్గేవ‌ర‌కు వేయించి.. అనంత‌రం కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు, టమోటా కెచప్ మ‌రియు కొత్తిమీర‌ వేసి ఉడికించాలి. 

 

బాగా ఉడికేవ‌ర‌కు ఉంచి స్ట‌వ్ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. ఇప్పుడు ముందుగా క‌లిపి పెట్టుకున్న పిండిని చ‌పాతీలుగా ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి. కర్రీ వేడిగా ఉన్నప్పుడు చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్ లా చుట్టుకుంటే స‌రిపోతుంది. 

 

అంతే ఎంతో రుచిక‌ర‌మైన చపాతీ వెజ్‌ రోల్స్‌ రెడీ అయిన‌ట్లే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తీసుకుంటే అదిరిపోతుంది. మ‌రి ఈ టేస్టీ చపాతీ వెజ్‌ రోల్స్‌  మీరు కూడా త‌యారు చేసుకుని ఎంజాయ్ చేయండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: