కావాల్సిన ప‌దార్థాలు:
ప‌చ్చి అర‌టికాయ‌లు తొక్క‌లు- 2 క‌ప్పులు,
పండు మిర‌ప‌కాయ‌లు- 5,
ఆవాలు- పావు టీస్పూన్‌,
బెల్లం- కొద్దిగా,
కొబ్బ‌రి తురుము- 1టేబుల్‌స్పూన్‌,
ఉప్పు- త‌గినంత‌, నూనె- 2 టేబుల్ స్పూన్లు.


త‌యారు చేసే విధానం:
ముందుగా ప‌చ్చి అర‌టికాయ‌లపై తొక్క‌లు తీసి వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. వాటిని ముక్క‌లుగా క‌ట్ చేసుకుని ప‌క్క‌న పెట్టుకోవాలి.  ఆ త‌ర్వాత స్టౌ వెలిగించి క‌డాయి పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె పోసి వేడిచేయాలి.  నూనె వేడి అవ్వ‌గానే అందులోకి అవాలు వేసి త‌ర్వాత పండు మిర‌ప‌కాయ‌లు మ‌రియు ప‌చ్చి అర‌టికాయ తొక్క‌ల ముక్క‌ల‌ని వేసుకోవాలి. 


ఆ త‌ర్వాత ఉప్పు వేసి స‌రిప‌డ‌నంత మంచినీళ్లు పోసి ఉడికించాలి. ఉడికే వ‌ర‌కు కాసేపు మూత పెట్టి ఉంచాలి. నెక్ట్స్ బెల్లం వేసి అది కూర‌లో క‌రిగేందుకు మ‌ళ్ళీ మూత‌పెట్టి ఉంచాలి. త‌ర్వాత కొబ్బ‌రి తురుములో గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీగా అర‌టి తొక్క‌ల‌తో కూర రెడీ. దీన్ని అన్నంలో క‌లుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. మ‌రి త‌ప్ప‌కుండా ట్రై చేయండి.


అరటి పండ్ల‌లో అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు అర‌టి పండ్ల‌ల‌తో మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, దాని తొక్క‌తో కూడా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. 


అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. ఇంకా ఎన్నో లాభాలు ఉన్న అర‌టికాయ తొక్క‌ల‌తో ప‌చ్చిగా తిన‌లేక‌పోతే కూర వండుకుని తింటే చాలా మంచిది.  



మరింత సమాచారం తెలుసుకోండి: