పిల్లల్లో, పెద్దలలో ఎప్పుడూ అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్ అంటే న్యూడిల్స్,ఫ్రైడ్ రైస్,మంచూరియా ఇంకా ఎన్నో వెరైటీస్ ని ఇష్టంగా తింటున్నారు. వీటిలోనే వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ అంటూ చాలా రకాలుగా చేసుకుంటున్నారు. అలానే ఇప్పుడు మనం ఒక కొత్త రకమైన మంచూరియాని ఎలా తయారుచేయాలో చూద్దామా. ఏంటా కొత్త రకమైన మంచూరియా అనుకుంటూన్నారా "సోయా మంచూరియా". సోయా తో ఎప్పుడూ కర్రీ చేయడమే కాదు ఇలా మంచూరియా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి. పర్ఫెక్ట్ గా రెస్టారెంట్ స్టైల్ లో సోయా మంచూరియా చేయాలంటే ఓ సారి ఇలా ట్రై చేసి చూడండి. సోయా అంటే ఏంటా అనుకుంటున్నారా "మిల్మేకర్".
కావాల్సిన పదార్ధాలు:

మిల్మేకర్-1 కప్పు,
ఉల్లిపాయ-2,
అల్లం వెల్లుల్లి పేస్ట్-కొద్దిగ,
కార్న్ ఫ్లోర్-కొద్దిగ,
మైదా-కొద్దిగ,
ఉప్పు-తగినంత,
కారం-కొద్దిగ,
టమాట సాస్-కొద్దిగ,
సొయా సాస్-కొద్దిగ,
టమాటా సాస్-కొద్దిగ,
నూనె-డీప్ ఫ్రైకి సరిపడినంత,
పంచదార-కొద్దిగ,
వెనీగర్-కొద్దిగ,
షేజ్వాన్ సాస్- కొద్దిగ,
పచ్చిమిర్చి-3,
అల్లం-కొద్దిగ (చిన్న ముక్కలుగా చేసుకోవాలి),
వెల్లుల్లి-కొద్దిగ (చిన్నముక్కలుగా చేసుకోవాలి).
మిరియాల పొడి-కొద్దిగ,
ఉల్లికాడలు-కొద్దిగ,
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసి అందులో మిల్మేకర్ ని వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని అందులోని నీళ్లని బాగా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటీలో కొద్దిగ అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, టమాటా సాస్, మైదా, కార్న్ ఫ్లోర్, తగ్గినంత ఉప్పు, కొద్దిగ కారం వేసి బాగా కలుపుకుని  15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి వేడైయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మిల్మేకర్ మిశ్రమాన్ని వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని వాటిని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరొక్క ప్యాన్ పెట్టి అందులో కొద్దిగ నూనె వేసి అందులో సన్నగా కట్ చేసిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కొంచెం వేయించుకోవాలి.

అవి వేగిన తరువాత కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చీ వేసి వేయించాలి. అవి వేగిన తరువాత ఒక టీ స్పూన్ సోయా సాస్, రెండు టీ స్పూన్ ల టమాటా సాస్ ని,ఒక టీ స్పూన్ షేజ్వాన్ సాస్ ని,కొద్దిగ మిరియాల పొడి, కొద్దిగ పంచదారని వేసుకుని కలుపుకోవాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో కొద్దిగ కార్న్ ఫ్లోర్ వేసి, అందులో నీళ్ళు పోసి, ఉండలు లేకుండా కలుపుకుని, ప్యాన్ లో వేసి చిక్కగా అయేంతవరకు కలుపుకోవాలి. అందులో చిటికెడు ఉప్పు వేసి ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మిల్మేకర్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తరువాత కొద్దిగ ఉల్లికాడలు వేసి, స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచి కరమైన "సోయా మంచూరియా" రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: