కావాల్సిన పదార్థాలు:
బెండకాయలు- అర కిలో
పెరుగు- ముప్పావు కప్పు
పచ్చిమిర్చి- 3
ఆవాలు- అర టీ స్పూను


ఎండుమిర్చి- 2
కరివేపాకు- 4 రెబ్బలు
నూనె- వేగించడానికి సరిపడినంత


పచ్చి కొబ్బరి తురుము- అర కప్పు
కొబ్బరి నూనె- అర టేబుల్‌ స్పూను
ఉప్పు- రుచికి తగినంత


తయారీ విధానం:
ముందుగా బెండకాయల్ని అంగుళం పొడవున తరిగి నూనెలో దోరగా వేయించి ఉప్పు చల్లి పక్కనుంచాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, కొబ్బరి తరుగు, పెరుగు కలిపి పేస్ట్‌లా చేసి దానిని వేయించిన బెండలో కలపాలి.


అవసరమైతే కొద్దిగా ఉప్పు చేర్చుకోవచ్చు. తర్వాత దోరగా వేయించిన తాలింపుని బెండ మిశ్రమంలో కలిపితే స‌రిపోతుంది. అంతే ఎంతో సులువుగా బెండ పెరుగు పచ్చడి రెడీ. పరొటాల‌తో దీని కాంబినేష‌న్ ఎంతో బాగుతుంది. బెండ‌కాయ‌ల్లో  పీచు, విటమిన్‌ సి పుష్క‌లంగా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.


పెరుగు మనిషికి బలాన్నిచ్చే వాటిలో అత్యున్నతమైనది. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. ఈ రెండిటి కాంబినేష‌న్లో బెండ‌కాయ పెరుగు ప‌చ్చ‌డి ఆరోగ్యానికి చాలా మంచిది.


మరింత సమాచారం తెలుసుకోండి: