ఇప్పుడు మనం చేయబోతున్న వంటకం "అక్కి రొట్టి". అక్కి రొట్టి అంటే ఏంటా అని అనుకుంటున్నారా వరి పిండితో చేసుకునే రొట్టి. ఇద్ది కర్ణాటకలో చాలా ఫేమస్ అయిన వంటకం. ఇది చాలా సులభంగా చేసుకునే రొట్టి. ఈ రొట్టిలో మనకి కావాల్సిన పదార్ధాలు అన్ని కలుపుకోవచ్చు. ఈ రొట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం అక్కి రొట్టికి కావాల్సిన పదార్ధాలు మరియు తయారీ విధానం ఎలానో ఇప్పుడు చూద్దాం."అక్కి రొట్టి" కి కావాల్సిన పదార్ధాలు:
వరి పిండి-ఒక కప్పు,     
ఉల్లిపాయలు-4,     
పచ్చిమిర్చి-3,  
జిలకర్ర-కొద్దిగ,    
 క్యారెట్-2,   
  కొత్తిమీర-కొద్దిగ,
  ఆయిల్-కొద్దిగ,   
  నీళ్లు-కొద్దిగ,     
ఉప్పు-సరిపడినంత,   
 కరివేపాకు-కొద్దిగ,

"అక్కి రొట్టి " తయారు చేసే విధానం:
ముందుగా మనం ఉల్లిపాయలను,పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ను తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక కప్పు బియ్యం పిండి,కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,జీలకర్ర,క్యారెట్ తురుము,కొద్దిగ కొత్తిమీర,కొద్దిగ కరివేపాకు,ఉప్పు తగినంత వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టిగా ముద్ద వచ్చేలాగా కలుపుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని కొద్దిగ ఆయిల్ వేసుకోవాలి. ఒక అరిటాకు తీసుకుని దాని మీద కొద్దిగ ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న ముద్దలా చేసి అరిటాకుమీద పెట్టి చేతితో గుండ్రంగా చపాతీలా చేసుకోవాలి.
ఇలా చేసిన అక్కిని పెనం మీద వేసి ఆయిల్ వేసుకుని రెండు వైపులా సన్నని సెగ మీద కాల్చుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యవంతమైన అక్కి రొట్టి రెడీ. ఈ అక్కి రొట్టి లో మనం కావాలనుకుంటే పల్లీలను కూడా వేసుకోవచ్చు.
న్యూట్రీషియన్ :
క్యారెట్: క్యారెట్ లోని అధిక క్యాలరీలు వల్ల పిల్లలు శారీరకంగా,మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడుతుందని మన వైధ్య నిపుణులు చెప్తున్నారు. ఇందులో విటమిన్ బి,సి,జి లు ఉంటాయి. అవి శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాస్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది.ఉల్లిపాయలు: ఉల్లిపాయల వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన కీలక పోషకాలు ఇందులో లభిస్తాయి.

కేవలం ఉల్లిపాయే కాదు దాని మీద ఉండే పొట్టు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ పొట్టును రాత్రి పడుకునే ముందు నీళ్ళలో వేసి, రాత్రి అంతా అలానే ఉంచి పొద్దున్నే ఆ పొట్టును తీసి ఆ నీళ్ళను శరీరంలో వాపు,నొప్పి ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయి. ఉల్లి పొట్టులో ఉండే మాంగనీస్,పొటాషియం, విటమిన్ సి,బి6 లు కొలెస్ట్రాల్ ను తగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: