గోధుమపిండితో మనం చాలా రకాల వంటకాలను చేసుకుంటాము. గోధుమ పిండితో చపాతీ చేసుకోవచ్చు, దోశెలలా వేసుకోవచ్చు,స్వీట్స్ చేసుకోవచ్చు,కేక్స్ చేసుకోవచ్చు ఇంకా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు.ఇప్పుడు మనం గోధుమపిండితో ఒక మంచి రుచి కరమైన జ్యూసీ జ్యూసీ స్వీట్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
"జ్యూసీ బనాన" స్వీట్ కి కావాల్సిన పదార్ధాలు:
పాలు-2 కప్పులు,
గోధుమపిండి-1 కప్పు,
పంచదార-3 కప్పులు,
యాలుకలు-5,
నెయ్యి-కొద్దిగ,
నీళ్ళు-తగినంత,
ఫుడ్ కలర్-చిటికెడుఆయిల్-డీ ఫ్రై కి సరిపడా,
"జ్యూసీ బనాన" తయారు చేసే విధానం:

ముందుగా ఈ జ్యూసీ బనానాకి మనం పాకాన్ని తయారు చేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో మూడు కప్పుల పంచదారను వేసి అందులో మూడు కప్పుల నీళ్ళు పోసుకుని 15 నిమిషాల పాటు మరిగించుకోవాలి.పాకం మరిగిన తరువాత అందులో యాలుకలు దంచి పెట్టుకున్న పొడిని వేసి చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని మరో 5 నిమిషాలు మరిగించుకుని పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు మల్లీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో రెండు కప్పుల పాలు పోసుకుని మరిగించాలి.పాలు మరిగిన తరువాత ఒక కప్పు గోధుమపిండి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమం ప్యాన్ కి అంటుకోకుండా వచ్చే అంత వరకు కలుపుకుంటూ ఉండాలి. అలా వచ్చాక ఒక స్పూన్ నెయ్యిని వేసి మళ్లీ బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారక ముందే చేతితో బాగా కలుపుకుంటా ఉండాలి. అది బాగా మెత్తగా వచ్చే అంత వరకు కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.ఇలా చేసుకున్న ఉండలను చేతిలో తిసుకుని పగ్గుళ్లు లేకుండా బూరెలులా చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని మనకి కావాల్సిన విధంగా నచ్చిన ఆకారంలో చేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి.


    మళ్లీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీ ఫ్రై కి సరిపడ్డా ఆయిల్ పోసుకుని వేడైయ్యాక, ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం బంగారు రంగు వచ్చాక ప్లేట్ లోకి తీసుకుని తర్వాత ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన జ్యూసీ బనాన రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: