కావలసిన పదార్థాలు: 
పన్నీర్‌ : 250గ్రాములు, 
టమోటా గుజ్జు : పావుకప్పు, 
ఉల్లిపాయలు : 3, 
నూనె : 5 చెంచాలు, 


ఉప్పు : తగినంత, 
కారం : కొద్దిగా, 
కొత్తిమీర : కొంచెం
క్రీమ్‌ : 3 చెంచాలు, 
పసుపు : చిటికెడు, 
ధనియాల పొడి : కొద్దిగా, 


తయారు చేసే పద్ధతి:
ముందుగా ఒక స్పూన్ వాట‌ర్‌లో కారం, ప‌సుపు, ధనియాలపొడి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉల్లిపాయలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేసి చేసి ముందుగా క‌ట్ చేసుకున్న‌ ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి ఫ్రై అయ్యాక‌ ముందుగా నీళ్లలో కలిపిన మసాలా మిశ్ర‌మాన్ని వేసి బాగా మిక్స్ చేసి పచ్చివాసన పోయాక టమోటా గుజ్జు, ఉప్పు వేసి కప్పు నీళ్లు పోసి మూత పెట్టాలి. 


పది నిమిషాలు అయ్యాక‌ పన్నీరు ముక్కలు కూడా వేసి కొంత స‌మ‌యం ఉడికించాలి. గ్రేవీలో పన్నీరు ఉడికాక క్రీమ్‌ వేసి పైన కొత్తిమీర చల్లి దించేయాలి. అంతే ఎంతో టేస్టీ టేస్టీ ట‌మాటా ప‌న్నీర్ క‌ర్రీ రెడీ.. టమోటాల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి. ట‌మాటాలో ఉండే ఔష‌ధాలు వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అలాగే పాల‌తో వ‌చ్చే ప‌న్నీర్‌లో ప్రోటీన్లు పుష్క‌లంగా ఉంటాయి. ఈ రెండిటి కాంబినేష‌న్లో ట‌మాటా ప‌న్నీర్ క‌ర్రీ తిన‌డం చాలా మంచిది.  



మరింత సమాచారం తెలుసుకోండి: